Begin typing your search above and press return to search.

బ్రెజిల్ లో భూకంపం .. తరువాత ఏంజరిగిందంటే ?

By:  Tupaki Desk   |   11 Dec 2019 10:29 AM GMT
బ్రెజిల్ లో భూకంపం .. తరువాత ఏంజరిగిందంటే ?
X
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా భూమి కుంగిపోయి భారీ గుంతలు పడటం సాధారణం. సాధారణంగా వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. అయితే , వాటిని పరిశీలించిన భూగర్భ శాస్త్రవేత్తలు..భూమి కింది భాగంలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలనే ఇలా జరుగుతోందని నివేదిక ఇచ్చారు. అయితే , తాజాగా ఇలాంటి ఘటనే బ్రెజిల్‌లో జరిగింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి కుంగిపోయింది.

బ్రెజిల్‌ రాజధాని బ్రెసీలియాలో కార్లు పార్క్‌ చేసి ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా భూమి కుంగిపోయి, ఆ ప్రాంతంలో పెద్ద గుంత ఏర్పడింది. దీనితో ఆ గుంతలోకి నాలుగు కార్లు అందులో పడిపోయాయి. అలాగే పక్కనున్న ఓ భవనానికి కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు అక్కడ ఏం జరుగుతుందో తెలియక పరుగులు తీశారు. సమాచారమందుకున్న అధికారులు అక్కడికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. భూమి కుంగిపోవడానికి గల కారణాలను గుర్తించే పనిలో బిజీగా ఉన్నారు.