భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని ఢీ కొట్టిన దురంతో ఎక్స్ ప్రెస్

Thu Mar 30 2023 10:20:18 GMT+0530 (India Standard Time)

Durantho Express collided with a Bolero vehicle at Bhimadolu

ఏలూరు జిల్లా భీమడో లు వద్ద అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున (గురువారం) రైల్వే ట్రాక్ మీద ఉన్న బొలెరో వాహనాన్ని వేగం గా వెళుతున్న దురంతో ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టింది. ఈ కారణం గా రైలు ఇంజిన్ దెబ్బ తినటంతో రైళ్ల రాకపోకల కు ఇబ్బందులు ఎదురయ్యాయి. దాదాపు రైల్వే ట్రాక్ మీద ఐదు గంటల పాటు దురంతో ట్రైన్ నిలిచిపోయింది.



గురువారం తెల్లవారుజామున మూడు గంటల వేళలో దురంతో ఎక్స్ ప్రెస్ రైలు వస్తున్న వేళ.. భీమడోలు జంక్షన్ వద్ద రైల్వే గేటును సిబ్బంది వేశారు. అయితే.. అదే సమయంలో బొలెరో లో వచ్చిన కొంతమంది.. తమ వాహనంతో రైల్వే గేటును ఢీ కొట్టి ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారి వాహనం ట్రాక్ మీద కు వచ్చిన వేళలోనే దురంతో రైలు వస్తుండటంతో భయపడిపోయిన వారు.. వాహనం నుంచి కిందకు దూకేసి పారిపోయారు.

అనూహ్యంగా ట్రాక్ మీద ఉన్న బొలెరో వాహనాన్ని దురంతో రైలు ఢీ కొట్టింది. దీంతో.. వాహనం పూర్తిగా ధ్వంసం కాగా.. రైలు ఇంజిన్ ముందు భాగం దెబ్బతింది. దీంతో.. ఆ ఇంజిన్ స్థానంలో కొత్త ఇంజిన్ ను అమర్చేందుకు ఐదు గంటలకు పైగా సమయం పట్టింది.

బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న వారుదొంగలా? లేక సాధారణ పౌరులా? అసలు ఎందుకు గేటును ఢీ కొట్టి వెళ్లాలనుకున్నారన్న అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.