Begin typing your search above and press return to search.

కరోనా పేషేంట్ రూ.1.52 కోట్ల బిల్లు మాఫీ ... ఆసుపత్రి ఉదారత !

By:  Tupaki Desk   |   16 July 2020 9:15 AM GMT
కరోనా పేషేంట్ రూ.1.52 కోట్ల బిల్లు మాఫీ ... ఆసుపత్రి ఉదారత !
X
దుబాయ్ ‌లో ఓ ఆసుపత్రి నిర్వాహకులు కరోనా కష్టకాలంలో తమ మానవత్వం చాటుకున్నారు. ఓ భారతీయునికి కరోనా చికిత్స కోసం అయిన రూ.1.52కోట్ల బిల్లును పూర్తిగా మాఫీ చేసి, ఆ తరువాత ఇండియాకి ఫ్లైట్ టికెట్ ఇచ్చి, ఆ వ్యక్తి జేబులో రూ.10వేలు పెట్టి మరీ అతడిని ఇండియాకు తిరిగి పంపించింది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. పొట్టకూటికోసం తెలంగాణ లోని జగిత్యాల జిల్లాకి చెందిన రాజేశ్ అనే వ్యక్తి దుబాయికి వెళ్ళాడు. అయితే, అతనికి ఏప్రిల్ 23న కరోనా వైరస్ పాజిటివ్ గా తేలడంతో అక్కడే వైద్యం కోసం హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. అయితే , అతడు కరోనా నుండి కోలుకోవడానికి సుమారుగా 80 రోజుల సమయం పట్టింది. దీనితో ఆ 80 రోజులకి ఆసుపత్రి యాజమాన్యం రూ.1.52కోట్ల బిల్లు అయ్యింది. ఆ బిల్లు చూసిన రాజేష్ ఒక్కసారిగా షాక్ కి గురైయ్యాడు.

ఆసుపత్రి దుబాయ్ కరెన్సీ ఏఈడీ 762,555.24 దిరాముల బిల్లు వేశారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.1,56,26,983.92 అవుతోంది. అయితే , అంత మొత్తంలో తాను డబ్బు చెల్లించలేనని ఇండియన్ ఎంబసీని ఆశ్రయించాడు. దానికి స్పందించిన ఎంబసీ అధికారులు మానవత్వంతో రాజేశ్ ‌కు వేసిన బిల్లును మినహాయించాలని కోరుతూ ఆసుపత్రి యాజమాన్యానికి లేఖ రాసింది. దీనితో స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం రాజేశ్ బిల్లను మాఫీ చేయడంతో పాటు అతడికి ఇండియాకు వచ్చేందుకు విమాన టికెట్లను బుక్ చేసింది. అలాగే ఫైఖర్చుల కోసం రూ.10వేలు జేబులో పెట్టి మరీ ఇండియాకు పంపించింది. దీంతో బుధవారం రాజేశ్ హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి అతన్ని సొంత గ్రామానికి చేర్చి 14 రోజుల హోం క్వారంటైన్ విధించారు. తనను సురక్షితంగా ఇంటికి చేరేందుకు ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి రాజేష్ ధన్యవాదాలు తెలిపాడు.