Begin typing your search above and press return to search.

ఆరోగ్యానికి మంచిదని డ్రై ఫ్రూట్స్ అతిగా తినేస్తున్నారా.. అయితే జాగ్రత్త పడాల్సిందే!

By:  Tupaki Desk   |   14 May 2022 7:28 AM GMT
ఆరోగ్యానికి మంచిదని డ్రై ఫ్రూట్స్ అతిగా తినేస్తున్నారా.. అయితే జాగ్రత్త పడాల్సిందే!
X
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని చాలా మంది చెబుతుంటారు. తింటుంటారు. అయితే ఎలాగూ మంచిదే కదా అని చాలా మంది అతిగా తినేస్తుంటారు. కానీ ఇలా తినడం అంత మంచిది కాదు. డ్రై ఫ్రూట్స్ లో ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్... పుష్కలంగా ఉంటాయి. వీటన్నింటిని పొందాలనుకున్న వారు డ్రై ఫ్రూట్స్ తింటే సరిపోతుంది. అయితే ఇవి రుచిగా కూడా ఉంటాయి. దీంతో చాలా మంది ఇష్టమొచ్చినట్లుగా తింటుంటారు. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. అయితే ఎంత తినాలి, ఎప్పుడు తినాలి వంటి అంశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డ్రై ఫ్రూట్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది బాదం. ఇందులో మోనో శాచ్యురేటెడ్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకు, మొదటికి, చర్మ ఆరోగ్యానికి మంచిది. అలాగే బాదాంలో విటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవి రక్త ప్రసరణ సక్రమంగా ఉండడానికి సాయపడతాయి. అలాగే రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహకరిస్తాయి. రోజుకు నాలుగు నుంచి ఐదు బాదం పలుకులు తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

రెండోది వాల్ నట్స్.. వీటి పైన ఉండే పెంకు తీయగానే ఉండే పప్పు అంత రుచిగా ఉండదు. కానీ 90 శాతం యాంటీ ఆక్సిడెంట్స్, ఫెనోలిక్ యాసిడ్స్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఈ స్కిన్ లోనే ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి చాలా సమర్థంగా పని చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

వీటిని రోజుకి 3 నుంచి 4 తీసుకోవచ్చు. కర్జూరం.. ఇందులో న్యూట్రియంట్స్, విటామిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని రోజుకు ఒకటి రెండు తీసుకుంటే సరిపోతుంది.

పిస్తా.. పిస్తా వెల్ నెస్ కి చిహ్నం. ఇవి బలానికి, ఆరోగ్యానికి బాగా ఉఫయోగపడతాయి. ఇందులో మిగిలిన డ్రై ఫ్రూట్స్ లో కంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. కమ్మటి రుచిలో ఉండే జీడి పప్పును రెగ్యులర్ గా తినడం వల్ల పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా నివారించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

రోజుకు నాలుగు జీడి పప్పులను తినడం వల్ల ఆరోగ్యకరమని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. తియ్య తియ్యగా పుల్ల పుల్లగా ఉండే ఎండు ద్రాక్ష ఎక్కువ మోతాదులో తిన్నా ఎలాంటి సమస్యా లేదు. ఇందులో విటామిన్ బి, పొటాషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. అయితే రోజుకు 50 ఎండు ద్రాక్షలను తినవచ్చు.