ఏపీ మందు బాబులు.. కేసీఆర్ డౌన్ డౌన్.. ఏందీ ఈ గోల?

Wed Dec 08 2021 13:04:47 GMT+0530 (India Standard Time)

Drunkers chanting the slogan KCR Down Down

వాళ్లు ఆంధ్రప్రదేశ్కు చెందిన మందుబాబులు. తమ రాష్ట్రంతో పోలిస్తే పక్క రాష్ట్రమైన తెలంగాణలో మద్యం ధరలు తక్కువని తాగేందుకు అక్కడికి వెళ్తుంటారు. అక్కడే కాస్త తాగడంతో పాటు మద్యం సీసాలను కూడా కొనుక్కెళ్తున్నారు. ఇక్కడి వరకూ అంతా ఓకే. కానీ మంగళవారం ఆ మందుబాబులు ఒక్కసారిగా కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది.పక్క రాష్ట్రం నుంచి తెలంగాణలో మద్యం తాగి తిరిగి ఇంటికి వెళ్తూ కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం ఏమిటీ? అనే సందేహాలు రేకెత్తాయి. అయితే అందుకో కారణం ఉంది.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో మద్యం ధరలు దాదాపు నాలుగింతలు పెంచేశాడు. అదేమంటే.. మద్య పాన కట్టడి కోసమేనని ఈ నిర్ణయమని అధికార వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. మద్యం ధరలు పెంచితే జనాలు అంత డబ్బులు చెల్లించలేక తాగడం మనేస్తారనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.

కానీ మందు బాబులకు ఎన్నో దారులు కదా. అందుకే ఏపీ సరిహద్దుల్లోని తెలంగాణ గ్రామాల్లోకి వెళ్లి మద్యం తాగి వస్తున్నారు. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరులో వైన్షాపు దగ్గరకు కర్నూలు జిల్లాలోని సమీప ప్రాంతాల ప్రజలు వచ్చారు. మద్యం తాగడంతో పాటు కొనుక్కుని వెళ్లారు.

కానీ.. వైన్షాప్ సమీపంలోని టోల్ప్లాజా దగ్గర ఉండవెల్లి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ చేపట్టడంతో మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైన్ షాప్ దగ్గరే తనఖీలు చేపట్టడం ఏమిటనీ ప్రశ్నిస్తున్నారు.

అందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కారణమంటూ కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇదీ.. మందుబాబులు నినాదాల వెనక ఉన్న కారణం. మరోవైపు ఏపీలో మద్యం రేట్లు పెంచడంతో వచ్చే ఎన్నికల్లో తమ ఓట్ల రేట్లు పెంచుతామని ఓటుకు రూ.10 వేలు చేస్తామని మందుబాబులు అనుకుంటున్న సంగతి తెలిసిందే.