Begin typing your search above and press return to search.

1300 కోట్ల డ్ర‌గ్స్‌..మ‌న పోలీసులు ఎలా ప‌ట్టుకున్నారంటే...

By:  Tupaki Desk   |   15 Dec 2019 4:30 PM GMT
1300 కోట్ల డ్ర‌గ్స్‌..మ‌న పోలీసులు ఎలా ప‌ట్టుకున్నారంటే...
X
భార‌త పోలీసులు మ‌రోమారు త‌మ స‌త్తా చాటుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠా గుట్టు ర‌ట్టుచేశారు. ఇటు భార‌త‌దేశంలో అటు ఆస్ట్రేలియాలో నిర్వ‌హించిన ఆప‌రేష‌న్‌ లో భారీ ఎత్తున డ్ర‌గ్స్‌ ను ప‌ట్టుకున్నారు. మ‌న‌దేశంలో సీజ్‌ చేసిన డ్ర‌గ్స్‌ విలువ రూ.100కోట్లు ఉంటుందని అంచ‌నా వేస్తున్న నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు ఈ ముఠా నుంచి సీజ్‌ చేసిన మొత్తం మాదక ద్రవ్యాల విలువ రూ.1300 కోట్లు ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ దందా నిర్వహిస్తున్న తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరిలో ఐదుగురు భారతీయులు కాగా - అమెరికా - ఇండోనేషియా దేశ‌స్తులు ఇద్దరు - నైజీరియాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు.

కొకైన్‌ అంతర్జాతీయ రవాణా సిండికేట్‌ను ముఠా ఢిల్లీ కేంద్రంగా భారీగా మ‌త్తుమందును త‌ర‌లిస్తోంద‌నే ముందస్తు సమాచారంతో నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు రంగంలోకి దిగారు. ఢిల్లీ అంతటా విస్తరించిన ఈ డ్రగ్‌ సిండికేట్‌ ను ప‌క‌డ్బందీగా ప‌ట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌ లో నుంచి సుమారు 20 కిలోల కొకైన్‌ ను సీజ్ చేశారు. ఢిల్లీ నుంచి ఆప‌రేష‌న్ చేస్తున్న ఈ ముఠాకు పంజాబ్‌ - ఉత్తరాఖండ్‌ - మహారాష్ట్రల్లో కూడా ఏజెంట్లు ఉన్న‌ట్లు స‌మాచారం. వీరందరితో ఆస్ట్రేలియా - కెనడా - యూఎస్‌ - నైజీరియా - శ్రీలంక - కొలంబియా - మలేషియా సహా పలు దేశాలతో సంబంధాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలోనూ అధికారులు నిర్వహించిన మాదకద్రవ్యాల వ్యతిరేక ఆపరేషన్‌ లో 55కిలోల కొకైన్‌ - 200 కిలోల ఇతర మత్తు పదార్థలను సీజ్‌ చేసింది. ఈ ముఠా నుంచి సీజ్‌ చేసిన మొత్తం మాదకద్రవ్యాల విలువ రూ.1300 కోట్లు ఉంటుందని అధికారులు వెల్ల‌డించ‌డాన్ని బ‌ట్టి ఎంత పెద్ద ఎత్తున ఈ ముఠా ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తోందో అర్థం చేసుకోవ‌చ్చు.