పోర్న్ స్టార్ తో లైంగిక ఒప్పందం కేసులో బుక్కైన ట్రంప్.. అరెస్ట్ తప్పదా?

Fri Mar 31 2023 12:01:27 GMT+0530 (India Standard Time)

Donald Trump Indicted In Stormy Daniels Case

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అమెరికా చరిత్రలోనే నేరారోపణలకు క్రిమినల్ ఛార్జ్ లను ఎదుర్కోనున్న తొలి మాజీ అధ్యక్షుడిగా అపఖ్యాతి మూటగట్టుకున్నారు. తనతో లైంగిక సంబంధాలున్నాయని ఆరోపించిన మహిళను డబ్బుతో ప్రలోభపెట్టినట్టు ట్రంప్ పై ఆరోపణలు వచ్చాయి.ఈ కేసలుో తాజాగా న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ వాటిని ధ్రువీకరించి ఆయనపై అభియోగాలు మోపింది.దీంతో ట్రంప్ ఇప్పుడు క్రిమినల్ ఛార్జ్ లను ఎదుర్కోనున్నారు.  ట్రంప్ లొంగిపోవడానికి విచారణను సమన్వయం చేయడానికి అతని న్యాయవాదిని సంప్రదించినట్లు మాన్హాటన్ జిల్లా అటార్నీ ఆల్విన్ బ్రాగ్ కార్యాలయం తెలిపింది. వచ్చేసోమవారం న్యూయార్క్కు ట్రంప్ వెళతారని.. మంగళవారం ఆయన మన్ హట్టన్ కోర్టులో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

-ట్రంప్ పై కేసు ఇదీ

2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో స్ట్రోమీ డానియల్స్ అనే పోర్న్ స్టార్ తో గతంలో తనకున్న శారీరక సంబంధం బయటపడకుండా ఆమెకు డబ్బు ఇచ్చి అనైతిక ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణలను ట్రంప్ ఎదుర్కొంటున్నారు అయితే ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ సదురు మహిళ రెండేళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించింది.

అయితే ట్రంప్ ఈ ఆరోపణలను ఖండించారు. తాను ఏ తప్పు చేయలేదని.. 2024 ఎన్నికల్లో పోటీచేయకుండా చేసేందుకే ఈ కుట్ర పన్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు ఈ కేసు విచారణ సమయంలోనే తనను అరెస్ట్ చేస్తారంటూ బాంబుపేల్చారు. ఒకవేళ తాను అరెస్ట్ అయితే పెద్ద ఎత్తున నిరసనలు తెలుపాలని రిపబ్లికన్ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. దీంతో ఈ కేసులో ఇప్పుడు ట్రంప్ అరెస్ట్ అవుతారా? లేదా? అన్నది ఉత్కంఠరేపుతోంది.
 
 న్యాయనిపుణుల అంచనా ప్రకారం ట్రంప్పై అభియోగాలు మోపబడితే అరెస్ట్ ఖాయం. బెయిల్ లేకుండా నిందితులను విడుదల చేయలేరు. భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి పద్ధతిని అనుసరించి ఈ ప్రక్రియ వేగంగా జరిగే అవకాశం ఉంది. మాజీ అధ్యక్షుడిని వీధిలో లేదా రద్దీగా ఉండే కోర్ట్హౌస్ కారిడార్లో చేతికి సంకెళ్లతో  అరెస్ట్ చేయడం అసంభవమని ట్రంప్ లాయర్లు అంటున్నారు.

ట్రంప్ లొంగిపోయే అవకాశం ఉందని ఆయన తరఫు లాయర్లు చెబుతున్నారు..అయితే అలాంటి ప్రయత్నం విఫలమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కేసుల్లో ట్రంప్ రెచ్చగొట్టారు. మరో నాటకానికి తెరతీయవచ్చని అంటున్నారు. అయితే న్యాయపరంగా పోరాడాలని ట్రంప్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

- ట్రంప్ చేతికి సంకెళ్లు వేస్తారా?

ట్రంప్ చేతికి సంకెళ్లు పడే అవకాశాలు చాలా తక్కువ. అతని నేరారోపణకు దారితీసిన ఆరోపించిన నేరాలు  అహింసాత్మకమైనవి. మాజీ అధ్యక్షుడు పారిపోయే అవకాశం లేదు. అదనంగా డిస్ట్రిక్ట్ అటార్నీ ఆల్విన్ బ్రాగ్ ట్రంప్ను అరెస్టు చేయడం తర్వాత పరిణామానుల పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కాబట్టి అతని చేతికి సంకెళ్లు వేయడం వంటి సంచలనాత్మక చర్యలు ఉండవని న్యాయవర్గాలు చెబుతున్నారు. .
 
ట్రంప్ను డిటెక్టివ్ ఇన్వెస్టిగేటర్లు కూడా విచారణ చేసి అరెస్టు చేస్తారని మాన్హట్టన్ జిల్లా అటార్నీ కార్యాలయం  ప్రాసిక్యూటర్లు చెప్పారు.    ట్రంప్ తన విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందా లేదా అనేది ఇంకా నిర్ణయించబడలేదు. ట్రంప్ హాజరు కావడానికి ప్రాధాన్యతను వ్యక్తం చేసినప్పటికీ అతని న్యాయ బృందం రిమోట్ ఆన్ లైన్ విచారణ కోసం వాదించే అవకాశం ఉంది.