ట్రంప్ సెల్ఫ్ గోల్.. అసలు ఆ పోర్న్ స్టార్ తో ఎఫైర్ కథేంటి?

Sat Apr 01 2023 12:32:16 GMT+0530 (India Standard Time)

Donald Trump And Stormy Daniels What Happened Exactly

అమెరికా చరిత్రలోనే తొలిసారిగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై లైంగిక ఆరోపణలు విచారణ అరెస్ట్ ఊహాగానాలు సాగుతున్నాయి. ఓ పోర్న్ స్టార్ తో ట్రంప్ లైంగిక సంబంధాలు పెట్టుకొని ఆమె నోరు తెరవకుండా డబ్బుతో ప్రలోభపెట్టారన్నది ఆరోపణ. ఈ కేసుపైనే ట్రంప్ బుక్కై ఇప్పుడు కటకటాల పాలయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ట్రంప్ పోర్న్ స్టార్ మధ్య ఏం జరిగింది? వీరు ఎక్కడ కలిశారు?  ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.అక్టోబరు 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ట్రంప్ కోసం మాజీ న్యాయవాది ఫిక్సర్ అయిన మైఖేల్ కోహెన్ ద్వారా  ఈ పోర్న్ స్టార్ తో లైంగిక సంబంధం బయటపెట్టకుండా   $130000 డాలర్లు   చెల్లించబడ్డారన్నది ఆరోపణ.. ఆగస్ట్ 2018లో కోహెన్ ఈ పోర్న్ స్టార్  స్టార్మీ డేనియల్స్కు హుష్ మనీ పేమెంట్ చేయడంలో క్యాంపెయిన్ ఫైనాన్స్ చట్టాలను ఉల్లంఘించినందుకు  తన నేరాన్ని అంగీకరించాడు. అతనికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. అతని శిక్ష నవంబర్ 2021లో ముగిసింది.

-ఇంతకీ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ ఎవరు?

ప్రస్తుతం 44 ఏళ్ల వయసున్న డేనియల్స్ లూసియానాలోని బాటన్ రూజ్లో స్టెఫానీ ఎ గ్రెగొరీలో జన్మించారు. ఆమె చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. ఆమెను పెంచిన తల్లి ఆమెను నిర్లక్ష్యం చేసింది. తొమ్మిదేళ్ల వయసులో ఒక పెద్ద వ్యక్తి తనను లైంగికంగా వేధించాడని 2018లో ప్రచురించిన తన జ్ఞాపకాలలో రాసింది.

డేనియల్స్ 17 సంవత్సరాల వయస్సులో ఒక స్ట్రిప్ క్లబ్లో "గెస్ట్ సెట్" ప్రదర్శనతో మోడలింగ్ రంగంలోకి వచ్చింది..  అసంఖ్యాక అశ్లీల వీడియోల్లో నటిస్తూ చిత్రాలకు దర్శకురాలిగా మారడం ప్రారంభించింది. ఈ  వ్యాపారంలో ప్రసిద్ధి చెందిన పోర్న్ స్టార్ గానూ ఎదిగింది.  రెండు దశాబ్దాలుగా అనేక పరిశ్రమ అవార్డులను గెలుచుకుంది. పోర్న్ స్టార్ గా పాపులర్ అయ్యి గణనీయమైన అభిమానులను సంపాదించుకుంది.
 
- పోర్న్ స్టార్ డొనాల్డ్ ట్రంప్ను ఎప్పుడు ఎలా కలిశారు?

జూలై 2006లో కాలిఫోర్నియా మరియు నెవాడా మధ్య సరిహద్దులో ఉండే లేక్ తాహో సరస్సు లో జరిగిన ఛారిటీ గోల్ఫ్ టోర్నమెంట్లో ట్రంప్ -పోర్న్ స్టార్ కలుసుకున్నారు. అప్పుడు  ఆమె వయసు 27 సంవత్సరాలు. అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు..  
డేనియల్స్ మరియు మరో ఇద్దరు మహిళలు   మొదటిసారి ట్రంప్ను కలుసుకున్నారు.

-ఆ తర్వాత ఏం జరిగింది?

మీడియాలో నివేదించబడిన కథనాల ప్రకారం ట్రంప్ అంగరక్షకులలో ఒకరు తన యజమానితో పార్టీ కోసం  పోర్న్ స్టార్ డేనియల్స్ ను ఆహ్వానించారు. ఆరోజు రాత్రి ట్రంప్ తన పైజామాలో డేనియల్స్ తో గడిపాడు. కొన్ని విలువైన బహుమతులు కూడా ట్రంప్ ఆమెకు ఇచ్చాడు.  ఆ రాత్రి ఇద్దరూ శృంగారంలో పాల్గొన్నారు.  

డేనియల్స్ విడుదల చేసిన పుస్తకంలోనూ ట్రంప్ తో జరిగిన రోమాన్స్ గురించి రాసుకొచ్చింది. ట్రంప్ యొక్క ప్రైవేట్ భాగాల గురించి వివరణ ఇచ్చింది. ట్రంప్ మాత్రం తాను ఎప్పుడూ డేనియల్స్తో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నానన్న దానిపై ఖండించారు ఆమె మాటలు అబద్ధం అంటూ ఆరోపించారు.  ఇప్పుడు ఈ కేసు కోర్టులకు ఎక్కింది. ట్రంప్ ను అరెస్ట్ చేస్తారా? లేదా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.