Begin typing your search above and press return to search.

శనివారం రాత్రి మెజిస్ట్రేట్ కు డాక్టర్ సుధాకర్ ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   24 May 2020 4:29 AM GMT
శనివారం రాత్రి మెజిస్ట్రేట్ కు డాక్టర్ సుధాకర్ ఏం చెప్పారు?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన డాక్టర్ సుధాకర్ ఉదంతంలో మరో పరిణామం చోటు చేసుకుంది. విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ వైద్య కేంద్రంలో అనస్థీషియా నిపుణుడిగా పని చేసే ఆయన..ఏపీలో ఎన్ 95 మాస్కులు లేవన్న విషయాన్ని చెప్పటం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్య పెద్ద ఎత్తున మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ రావటం.. ఆ తర్వాత పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే.

సస్పెన్షన్ కు గురి కావటం.. తర్వాత విశాఖ రోడ్ల మీద ఒంటి మీద చొక్కా లేకుండా ధర్నా చేయటం.. పోలీసులు ఆయన పట్ల అనుచితంగా వ్యవహరించినట్లుగా ఆరోపణలు రావటం తెలిసిందే. అయితే.. ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని వైద్యులు తేల్చటం లాంటి పరిణామాలు ఒకపక్క.. ఇదే అంశంపై రాష్ట్ర హైకోర్టు సంచలన నిర్ణయాన్ని తీసుకోవటంతో హాట్ టాపిక్ గా మారారు డాక్టర్ సుధాకర్.

ఇదిలా ఉంటే.. శనివారం రాత్రి మెజిస్ట్రేట్ ముందుకు వచ్చిన సుధాకర్ పలు సంచలన విషయాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. న్యాయమూర్తి ముందు సుధాకర్ వాంగ్మూలంలో వెల్లడైన షాకింగ్ అంశాలు వెల్లడయ్యాయి. అవేమంటే?

% మాస్కుల గురించి అడిగితే అధికారులు తిట్టారు. ఆ సమయంలో మీడియా వాళ్లు ఉన్నారు. వారు విషయం అడిగితే జరిగింది చెప్పాను. ఏప్రిల్ 8న సస్పెండ్ చేశారు. ఆ ఆదేశాల్ని అంబులెన్స్ డ్రైవర్ తెచ్చి ఇచ్చారు.

% ఇది జరిగిన రెండు రోజులకు స్కోడా కారులో వచ్చిన వాళ్లు మా అబ్బాయి బైకు తీసుకెళ్లారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లాను. అక్కడి మహిళా కానిస్టేబుల్ నా చేతులు పట్టుకొని వదలండి అంటూ కేకలేసింది. పోలీసులంతా నన్ను కొట్టారు.

% బ్యాంకులో డబ్బులు వేసేందుకు వెళుతుంటే ఎవరో ఫాలో అవుతున్నట్లు గమనించాను. ఆగితే.. కానిస్టేబుళ్లు వచ్చి నా సస్పెన్షన్ గురించి అడిగారు. కారులో ఉన్న రూ.10లక్షలు తీసుకున్నారు. మందుబాటిళ్లు పెట్టారు.

% నన్ను తాగుబోతుగా.. పిచ్చోడిలా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి కేజీహెచ్ కు అక్కడి నుంచి మెంటల్ ఆసుపత్రికి తరలించారు.