Begin typing your search above and press return to search.

చావుకు ఎదురెల్లే వాడు ఎవరో తెలుసా... వీడే..! అతడి గురించి తెలిసిన షాకింగ్ నిజాలు ఇవే..!

By:  Tupaki Desk   |   4 May 2021 2:30 AM GMT
చావుకు ఎదురెల్లే వాడు ఎవరో తెలుసా... వీడే..! అతడి గురించి తెలిసిన షాకింగ్ నిజాలు ఇవే..!
X
కరోనా పేరు చెబితే చాలు. అందరూ పది ఆమడ దూరం పరిగెత్తే వారే. పక్కన వున్నవారు ఎవరైనా తుమ్మినా, దగ్గినా జడుసుకుంటున్నారు. కరోనా భయంతో కొంతమంది ఏకంగా ఉద్యోగాలే మానేసి ఇళ్లలోనే ఉంటుండగా, డబ్బునోళ్లు అయితే ఏకంగా విదేశాలకు పారిపోతున్నారు. ఇంతలా భయపెడుతున్న కరోనా అంటే భయపడని ఓ యువకుడు కూడా ఉన్నాడు. కోవిడ్ వైరస్ తనను ఏమీ చేయలేదని దానికే ఎదురు వెళ్తున్నాడు... యూకేలోని డర్హమ్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.

కరోనా ప్రబలినప్పటి నుంచి దాని నియంత్రణకు వ్యాక్సిన్ తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. నిరంతరం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఏదైనా ఒక వ్యాక్సిన్ సిద్ధం చేసేటప్పుడు శాస్త్రవేత్తలు ముందుగా ఆ వ్యాక్సిన్ ను వందలాది మంది వాలంటీర్లకు ఇచ్చి దాని పనితీరును తెలుసుకుంటారు. క్లినికల్ ట్రయల్స్ లో విజయవంతం అయిన తర్వాతే దానిని అందుబాటులోకి తెస్తారు. డర్హమ్ ప్రాంతానికి చెందిన 23 సంవత్సరాల జాకబ్ హాప్ కిన్స్ కూడా శాస్త్రవేత్తల హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ లో వాలంటీర్ గా ఉన్నాడు. అతడు కరోనా వైరస్ ను స్వయంగా తనకు తాను ఎక్కించుకుంటున్నాడు.

దీనిపై హాప్ కిన్స్ మాట్లాడుతూ ' నేను ఎంతో ఆరోగ్యంగానూ ఫిట్ గానూ ఉన్నాను. కరోనాను తాను ఎక్కించుకున్నా ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి లేదు. మరణించే అవకాశం కూడా తక్కువ. అందుకే తాను హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ లో భాగం అయ్యాను. ప్రపంచంలోని లక్షలాది మంది ప్రాణాలు కాపాడడానికి, వారికి త్వరగా వ్యాక్సిన్ అందజేయడానికి తన వంతు సాయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని హాప్ కిన్స్ చెబుతున్నాడు.

యూకేలో కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు బ్రిటన్లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్, వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ కలిసి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా వైద్య నిపుణులు వాలంటీర్లకు కరోనా వ్యాక్సిన్ అందజేయనున్నారు. వివిధ దశల్లో ఉన్న వైరస్ ను వారికి ఎక్కించి వారందరినీ నిశితంగా పరిశీలించనున్నారు. కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది?, అది ఎంత స్థాయిలో ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుంది? వైరస్ పై వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? తదితర ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడానికి శాస్త్రవేత్తలు ఈ ఈ క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తున్నారు.

అయితే క్లినికల్ ట్రయల్స్ పేరుతో యువకులకు వైరస్ ఎక్కించి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు.. అని ప్రజల నుంచి విమర్శలు కూడా ఉన్నాయి. ఏదేమైనా వ్యాక్సిన్ కనుగొనడానికి శాస్త్రవేత్తలకు సహకరించేందుకు స్వయంగా కరోనా వైరస్ ను ఎక్కించుకునేందుకు ముందుకు వచ్చిన జాకబ్ హాప్ కిన్స్, తదితర యువకులపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.