Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ఎఫెక్ట్ః రెండు రోజుల్లో ఎంత మ‌ద్యం కొన్నారో తెలుసా?

By:  Tupaki Desk   |   12 May 2021 3:38 PM GMT
లాక్ డౌన్ ఎఫెక్ట్ః రెండు రోజుల్లో ఎంత మ‌ద్యం కొన్నారో తెలుసా?
X
క‌రోనా విజృంభిస్తుండ‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వం లాక్ డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం కేవ‌లం ఒక్క రోజు గ‌డువుతోనే లాక్ డౌన్ అనౌన్స్ చేయ‌డంతో.. జ‌నాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఎవ‌రికి కావాల్సిన స‌రుకులు వారు తెచ్చిపెట్టుకునేందుకు ప‌రుగులు పెట్టారు. ఇందులో మందుబాబులు అంద‌రిక‌న్నా ముందుగా వైన్ షాపుల వ‌ద్ద‌కు ప‌రిగెత్తారు.

చాంతాడంత క్యూలో నిల‌బ‌డి మ‌రీ ప‌ది రోజుల‌కు స‌రిప‌డా మద్యం కొనుగోలు చేశారు. చాలా చోట్ల మీద మీద ప‌డి మందు బాటిళ్లు కొనుక్కెళ్లారు. ఈ విధంగా నిన్న ఒక్క‌రోజే (మంగ‌ళ‌వారం) ఏకంగా రూ.125 కోట్ల విలువైన మ‌ద్యం కొనేశార‌ట‌!

లాక్ డౌన్ అంశం మ‌ద్యాహ్నం త‌ర్వాత అంద‌రికీ తెలిసినందు వ‌ల్ల‌.. చాలా మంది వైన్ షాపుల‌కు వెళ్ల‌లేక‌పోయారు. దీంతో.. బుధ‌వారం కూడా మ‌ద్యం షాపుల ముందు బారులు తీరారు మందు బాబులు. ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు అన్ని వ్యాపార లావాదేవీల‌తోపాటు మ‌ద్యం షాపుల‌ను కూడా తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.

దీంతో.. లాక్ డౌన్ మొద‌టి రోజు కూడా జ‌నం ఎగ‌బ‌డ్డారు. కేవ‌లం నాలుగు గంట‌ల్లోనే 94 కోట్ల రూపాయ‌ల విలువైన మ‌ద్యం కొనుగోలు చేశారు. ఈ విధంగా రెండు రోజుల్లో క‌లిపి ఏకంగా.. 219 కోట్ల విలువైన మ‌ద్యం కొన్నారు మందు బాబులు. ప్ర‌భుత్వం లాక్ డౌన్ ఎప్ప‌టి వ‌ర‌కు పొడిగిస్తుందో? అనే ఆందోళ‌న‌తో జ‌నాలు ఫుల్లుగా ఎగ‌బ‌డ్డారు.