Begin typing your search above and press return to search.

ఆ సీఎంకు గడ్డు కాలం ? కేసీఆరు సహా అందరూ ఝలక్?

By:  Tupaki Desk   |   21 March 2023 5:00 PM GMT
ఆ సీఎంకు గడ్డు కాలం ? కేసీఆరు సహా అందరూ ఝలక్?
X
ఏడెనిమిదేళ్ల కిందట దాకా ఆయనో ప్రభంజనం.. ఐదారేళ్ల కిందటి వరకు ఆయనో సంచలనం.. ఏడాది కిందటే ఆయనో గెలుపు పవనం.. అయితే, ఇప్పటికీ ప్రాధాన్యం దక్కకున్నా.. కాలం మాత్రం ఎదురుతిరుగుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.రాజకీయంగా ప్రస్థానం ఎలా ఉన్నా.. ఒకదాని వెనుక ఒకటి ఘటనలు..ఊపిరి తీసుకోనివ్వడం లేదు. అటు పంజాబ్ లో ఖలిస్థానీవాదతో చెలరేగుతున్న శక్తులు.. ఇటు ఢిల్లీలో మద్యం విధానం కుంభకోణంలో సన్నిహితులు.. మధ్యలో ఢిల్లీ మున్సిపాలిటీలో గెలిచినా అనేక అడ్డంకులు. పిలిచినా పలుకలేదా..? పైన చెప్పుకొన్నదంతా ఎవరి గురించో ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది.

ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పరిస్థితి ఇది. ఎంత చెప్పినా.. ఏం చెప్పినా ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం ఆమ్ ఆద్మీ పార్టీకి అంటుకుంది. ఇది చెరిపినా చెరిగే మచ్చలా లేదు. దీన్నుంచి బయటపడడం ఎలాగని తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం తలబద్దలు కొట్టుకుంటున్నారు. ఇక ఆయన కంటే రాజకీయంగా అనుభవం తక్కువైన కేజ్రీ పరిస్థితి ఎలాగుంటుందో చెప్పాల్సిన పనిలేదు. "మూడో " ముచ్చట కేజ్రీవాల్ పార్టీ ఆప్.. ఢిల్లీ, పంజాబ్ లో అధికారం చేజిక్కించుకోవడం..గోవా, గుజరాత్ లో ఉనికి చాటుకోవడం.. జాతీయ పార్టీగా ఎదగడం బీజేపీకి సుతరామూ ఇష్టం లేదు.

అందుకని ఎక్కడ దొరుకుతుందా? అని చూసి ఢిల్లీ మద్యం స్కాంలో పీక పట్టుకుంది. ఇలాంటి సమయంలో దాన్నుంచి సురక్షితంగా బయటపడేందుకు కేజ్రీ మార్గాలు వెదుక్కోవాలి. అయితే, ఆయన జాతీయ స్థాయిలో మూడో కూటమి ముచ్చటలో ఉన్నారు.

అటు అఖిలేశ్- మమత మూడో కూటమి ప్రయత్నాలు చేస్తుండగా కేజ్రీ కూడా తాను ఉన్నానని నిరూపించుకునే పనిలో పడ్డారు. ఏకంగా తోటి ముఖ్యమంత్రులు ఏడుగురిని విందునకు ఆహ్వానించారు. మోదీకి జంకిన సీఎంలు..?కేజ్రీ విందుకు వెళ్తే ఏం జరుగుతుందో ముందే పసిగట్టిన సీఎంలు మొహమాటం లేకుండా గైర్హాజరయ్యారు. వాస్తవానికి ఈ వార్త ఆలస్యం వెలుగులోకి వచ్చింది.

కేజ్రీ రాజకీయ విందు ఏర్పాటు చేసింది శనివారం. దీనికి దేశంలోని బీజేపీ.. కాంగ్రెస్సేతర పార్టీల ముఖ్యమంత్రులు కాకుండా మిగిలిన ముఖ్యమంత్రుల్లో ఏడుగురిని (ఆయనతో పాటు ఎనిమిది) ఢిల్లీకి ఆహ్వానించారు. ప్రత్యేకంగా ఒక లేఖ కూడా రాశారు. ప్రగతిశీల సీఎంల సంఘం కేజ్రీ.. ప్రోగ్రెసివ్ చీఫ్ మినిస్టర్స్ గ్రూప్ ఆఫ్ ఇండియా (ప్రగతిశీల ముఖ్యమంత్రుల సంఘం) పేరుపెట్టి మరీ.. పొట్టిగా చెప్పాలంటే "జీ8" పేరుతో ఆయన విందు భేటీకి ఆహ్వానించారు.

లోక్ సభ ఎన్నికల వేళ.. కేంద్ర రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషించేందుకు పూర్వ రంగం ఇది. కానీ, ఆయన అంచనాలకు భిన్నంగా ఏ సీఎం కూడా ఈ విందుకు రాలేదు. మరి ఈ జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఉన్నారా?లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే.. కేసీఆర్ ఖమ్మంలో భారత్ రాష్ట్ర సమితి ప్రారంభ సభకు కేజ్రీని పిలిచారు. ఆయన వచ్చారు. కానీ, ఇప్పుడు కేజ్రీ విందుకు కేసీఆర్ వెళ్లలేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.