లైంగిక సామర్థ్యాన్ని పెంచే జ్యూస్ లు వచ్చేశాయి..

Sat Apr 01 2023 17:24:48 GMT+0530 (India Standard Time)

Dietary nitrates in juices are good for sexual health

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇప్పుడు అందరికీ శృంగారం లోపిస్తోంది. పనులు ఉద్యోగాలు వ్యాపారాలతో ఆ కార్యానికి చాలా మంది దూరం అయిపోతున్నారు. మగాళ్లలో లైంగిక పటుత్వం తగ్గిపోతోంది. అందుకే ఇప్పుడు ఈ శృంగార సామర్థ్యాన్ని పెంచే ఔషధాలకు మార్కెట్లో తెగ డిమాండ్ నెలకొంది. తాజాగా ఓ కొత్త జ్యూస్ లు వీటికి దోహదం చేస్తాయని పరిశోధనలో తేలింది.తినే ఆహారంతోనే పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుందని తేలింది. కొన్ని రకాల జ్యూస్ లు పురుషుల్లో ఈ లైంగిక సామర్థ్యం పెంచడానికి దోహదపడుతున్నాయని పరిశోధనలో తేటతెల్లమైంది.  ఈ జ్యూస్ లు పురుషుల్లో సెక్స్ హార్మోన్ అయిన టెస్టోస్టీరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతోందని తేలింది. వీటిని డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  

పురుషుల్లో దానిమ్మ టెస్టోస్టీరాన్ ఉత్పత్తిని పెంచడానికి.. వారి లైంగిక జీవితాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని తేలింది.

అలాగే పైనాపిల్ పుదీనాతో తయారు చేసిన జ్యూస్ కూడా పురుషుల లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుందని తేలింది. ఇందులో విటమిన్ సి ఉండి లైంగిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని వెల్లడైంది.

బీట్ రూట్ జ్యూస్ కూడా లైంగిక సామర్థ్యాన్ని రెండింతలు చేస్తుందని తేలింది. బీట్ రూట్ లోని డైటరీ నైట్రేట్లు టెస్టోస్టీరాన్ ఉత్పత్తిని పెంచుతాయని తేలింది. దీన్ని వారానికి రెండు మూడు సార్లు తీసుకుంటే చాలా మంచిది అని తేలింది.

ఇక బాదాం ఖర్జురాలతో తయారు చేసిన షేక్ కూడా టెస్టో స్టీరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుందని తేలింది. ఇవి లైంగిక ఆరోగ్యానికి మంచి ఆహారాలు అని తేల్చారు.

ముఖ్యంగా ఎరుపు రంగులో ఉండే పండ్లు పానీయాల్లో శృంగారాన్ని పెంచే దివ్యౌషధాలు ఉన్నాయని ఈ పరిశోధనలో తేలింది. అందుకే ఈ దానిమ్మ బీట్ రూట్  లాంటివి ఎక్కువతీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.