Begin typing your search above and press return to search.

సీఎం అయి ఉండి.. జనగణమణ.. ఇలానా పాడేది? ఇదేంది దీదీ?

By:  Tupaki Desk   |   3 Dec 2021 4:52 AM GMT
సీఎం అయి ఉండి.. జనగణమణ.. ఇలానా పాడేది? ఇదేంది దీదీ?
X
అందరికి స్ఫూర్తిగా ఉండాల్సిన విషయాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని ప్రభుత్వాధినేతలు గుర్తించాలి. అలాంటిదేమీ చేయకుండా ఉండటం వల్ల జరిగే డ్యామేజ్ అంతా ఇంతా కాదు.

తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా.. కాంగ్రెస్ లేకుండా బలమైన ప్రాంతీయ పార్టీలతో కలిసి జట్టు కట్టాలన్న ఆలోచనలో ఉన్న ఆమె.. తాజాగా మహారాష్ట్రలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

మూడు రోజుల పర్యటన కోసం ముంబయి వచ్చిన ఆమె.. తన టూర్లోని రెండో రోజున ఆమె చేసిన పనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తటమే కాదు.. ఆమెపైన ముంబయి పోలీసులకు ఒక కంప్లైంట్ కూడా అందింది. ఇంతకూ ఆమె చేసిన అంత పెద్ద తప్పేమిటన్నది చూస్తే..
తన టూర్ లో భాగంగా మీడియాతో మాట్లాడేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు మమతా బెనర్జీ. ఈ సందర్భంగా మాటల మధ్యలో జాతీయ గీతమైన జనగణమణను ఆలపించారు.

నిజానికి ఆమె నోటి నుంచి అప్పుడు జనగణమణ వస్తుందన్న అంచనా వేయని సభికులు కూడా అలెర్టు కాలేదు. జాతీయ గీతాన్ని ఆలపించటం షురూ చేసిన మూడు.. నాలుగు సెకన్లకు కుర్చీలో నుంచి హటాత్తుగా లేచారు. ఆ వెంటనే ఆమె పక్కనున్న వారి నుంచి.. సభలో ఉన్న వారు సైతం చటుక్కున లేచి నిలచున్నారు.

ఇదో వివాదమైతే.. జనగనమణను చాలా సింఫుల్ ఫై చేసి.. మధ్యలో ఆపేశారు. జై మహారాష్ట్ర.. జై బెంగాల్.. జై భారత్ అంటూ ముగించారు. ఈ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెచేసిన పనికి సంబంధించిన చిట్టి వీడియోలు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి. మమత తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఆమె తీరును తీవ్రంగా తప్పు పట్టిన బెంగాల్ బీజేపీ యూనిట్ ఘాటు ట్వీట్ చేసింది.

జాతీయ గీలాపన వేళ మమత మొదట కూర్చున్నారు. ఆ తర్వాత లేచి నిలబడి.. భారత జాతీయ గీతాన్ని సగంలో ఆపేశారు. ఈ రోజు సీఎంగా ఉండి కూడా మమత బెంగాల్ కల్చర్ ను.. జాతీయ గీతాన్ని.. దేశాన్ని.. బెంగాలీ అయిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ను అవమానించారంటూ ట్వీట్ చేశారు. మమత తీరును పలువురు తప్పు పడుతున్నారు. కొత్త జట్టు కట్టటానికి వచ్చి.. ఇలా చేయటం ఏమిటి మమతమ్మ? అంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఒక సీనియర్ ముఖ్యమంత్రి ఇలా చేయటమా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.