ఆ నటి ఆత్మహత్యాయత్నం చేసిందా? దానికి ఆమె ఏమన్నారంటే?

Sun Jan 16 2022 10:56:45 GMT+0530 (IST)

Did the actress commit suicide?

గతంలో ఎవరైనా ప్రముఖులు.. సినీ నటులు అనారోగ్యంతో ఉన్నారు.. ఆసుపత్రి పాలయ్యారన్నంతనే చావు వార్తలు.. బ్రేకింగ్ న్యూస్ కింద వచ్చేవి. బతికి ఉన్నా.. ఇలా చంపేస్తారా? అంటూ ఆవేదనతో వారు ఖండించేవారు. ఇక.. వారి కుటుంబ సభ్యుల వేదన అంతా ఇంత కాదన్నట్లుగా ఉండేది. మీడియాలో నెలకొన్న పోటీతో ఇలాంటి విపరీతాలు ఉండేవన్న విమర్శ ఉంది. ఇదిలా ఉంటే.. మీడియాను తలదన్నేలా సోషల్ మీడియా ఎంట్రీ ఇవ్వటం.. వార్తలకు మూలంగా ఈ మీడియంపెరుగుతున్న కొద్దీ అనారోగ్య వాతావరణం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.ఒక విధంగా చూస్తే.. సోషల్ మీడియాతో ఎక్కడేం జరిగినా ఇట్టే బయటకు వచ్చే వీలు ఉండటం.. విషయాల్ని నిలువరించే అవకాశాలు తగ్గిపోవటం వరకు బాగున్నా.. కొందరు కావాలని.. పని కట్టుకొని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టేలా ఫేక్ న్యూస్ ను వైరల్ చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా కోవలోకే వస్తుంది. మలయాళ నటి భామ సూసైడ్ అటెంప్టు చేసిందన్న ప్రచారం జోరందుకుంది. ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు మింగి చనిపోయే ప్రయత్నం చేశారంటూ వార్తలు వస్తున్నాయి.

2020లో వ్యాపారవేత్త అరుణ్ ను పెళ్లి చేసుకొని.. ఒక కుమార్తెతో హ్యాపీగా ఉన్న ఆమె.. ఆత్మహత్యాయత్నం చేసుకోవాల్సిన అవసరం ఏముందన్న ఆశ్చర్యం వ్యక్తమైంది. పెళ్లైన ఏడాదికే పండంటి పాపకుజన్మను ఇవ్వటమే కాదు.. ఈ మధ్యనే బిడ్డ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించారు. ఈ అనుమానాలకు తగ్గట్లే.. ఎవరైతే ఆత్మహత్య యత్నం చేశారని వార్తలు వస్తున్నాయో.. సదరు నటి తాజాగా రియాక్టు అయ్యారు. పలు చిత్రాల్లో నటించిన ఆమెకు మలయాళ నటిగా మంచి గుర్తింపు ఉంది.

తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని.. తాను ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేసుకోలేదని పేర్కొన్నారు. ‘ఎవరూ ఆందోళన చెందొద్దు. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. మీ ప్రేమాభిమానాలకు ధన్యావాదాలు’ అంటూ ఆమె తన ఇన్ స్టా అకౌంట్లో స్టోరీ పోస్టు చేశారు. ఇక.. ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకున్నారన్న వార్తను పుట్టించిన వారు.. ఆమె సూసైడ్ కు కారణాన్ని కూడా ప్రస్తావించారు. 2017లో నమోదైన వేధింపుల కేసును తిరిగి విచారిస్తున్న నేపథ్యంలో భయాందోళనలకు గురై ఇలాంటి పనికి పాల్పడినట్లుగా పేర్కొన్నారు. అయితే.. నటి భామ మాత్రం వీటిని కొట్టి పారేస్తున్నారు.