కరోనాను చైనానే పుట్టించిందా? : సంచలనం రేపుతున్న డాక్యుమెంట్!

Sun May 09 2021 19:00:01 GMT+0530 (IST)

Did Corona originate in China? : Sensational Document!

ప్రపంచాన్ని తీవ్రస్థాయిలో కుదిపేస్తున్న కరోనా వైరస్.. పుట్టుక.. ప్రాంతం ఊహాన్.. చైనాలోనే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు దీనిపై ఎవరికి ఎలాంటి అపోహలేదు. అయితే.. వాస్తవానికి వైరస్ ఎలా ఉద్భవించింది?  ఎక్కడ నుంచి వచ్చింది?  ఎలా వచ్చింది? అనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ సమాధానం లేదు. అనేక జంతువుల నుంచి వచ్చిందని గత ఏడాది ప్రచారంలో ఉన్నప్పటికీ.. దీనికి సరైన ఆధారాలు లభించలేదు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై అనేక ప్రయోగాలు పరిశీలనలు చేసినా.. ఆధారాలు లభించలేదని కొట్టిపారేసింది.కరోనా వైరస్‌ను చైనా లాబరేటరీలో తయారు చేసిందని.. కావాలనే ప్రజల మధ్యకు వదిలిందని అమెరికా సహా పలు దేశాలు(ట్రంప్ హయాంలో) ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిని చైనా సహా ఈ దేశ మద్దతు దేశాలు ఖండించాయి. కానీ.. ఇప్పుడు దీనికి సంబంధించిన సంచలన విషయం వెలుగు చూసింది. తాజాగా బహిర్గతమైన ఓ డాక్యుమెంట్ చైనా కుతంత్రాలను బయటపెట్టింది.  ఐదేళ్ల క్రితం నాటి ఈ డాక్యుమెంట్‌లో చైనా మిలిటరీ శాస్త్రవేత్త ఒకరు మూడో ప్రపంచం యుద్ధం గురించి చర్చించారు. సార్స్ వైరస్ జాతి నుంచి తయారు చేసిన జీవాయుధంతో యుద్ధం జరుగుతుందని చైనా ప్రభుత్వ ఆరోగ్య అధికారితో చర్చించినట్లు ఈ డాక్యుమెంట్ వెల్లడించింది. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ దీనిని స్వాధీనం చేసుకుంది.

చైనా శాస్త్రవేత్తలు ప్రజారోగ్య అధికారులు సార్స్ కరోనావైరస్ ఆయుధీకరణ గురించి మాట్లాడినట్లు పరిశోధనా పత్రం వెల్లడించింది. ఆస్ట్రేలియన్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వెబ్‌సైట్ న్యూస్.కామ్ ప్రకారం "ది అన్‌నాచుర్ ఆరిజిన్ ఆఫ్ సార్స్ అండ్ న్యూ స్పీసిస్ ఆఫ్ మ్యాన్-మేడ్ వైరసెస్ యాజ్ జెనెటిక్ బయోవెపన్స్" డాక్యుమెంట్‌లో చైనా మిలటరీ శాస్త్రవత్త తదుపరి ప్రపంచ యుద్ధం సార్స్ జాతికి చెందిన జీవ ఆయుధాలతో జరుగుతుందని అంచనా వేశారు.

కరోనావైరస్‌లను "జన్యు ఆయుధాల కొత్త శకం"గా "కృత్రిమంగా అభివృద్ధి చెందుతున్న హ్యూమండైజ్ వైరస్‌గా మార్చవచ్చని.. తరువాత తరంలో వాడే ఆయుధాలు మునుపెన్నడూ చూడని విధంగా ఉంటాయని" ఈ డాక్యుమెంట్‌లో వెల్లడించారు. చైనీస్ నేత్ర వైద్య నిపుణురాలు వైరాలజిస్ట్ లి-మెంగ్ యాన్ చైనా ప్రభుత్వ ప్రయోగశాలలో సార్స్-కోవ్-2 వైరస్ తయారైనట్లు ఆరోపించిన డాక్యుమెంట్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కూడా ఈ తరహాలోనే బయటకు వచ్చిందని.. వెల్లడించడం ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. మరి ఈ పరిణామం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.