ఢిల్లీలో ఘోరం: మద్యం మత్తులో కారుతో మహిళను ఈడ్చుకెళ్లిన పోలీస్

Sun Jul 05 2020 11:38:52 GMT+0530 (IST)

Delhi Police sub-inspector runs over woman

ఆపత్కాలంలో ప్రజలను రక్షించాల్సిన ఓ పోలీస్ దారుణంగా ప్రవర్తించాడు. ప్రమాదం జరిగితే రక్షించాల్సిన పోలీస్ క్రూరంగా వ్యవహరించాడు. ఇంతకు ఏం చేశాడంటే మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ మహిళను ఢీకొన్నాడు. అనంతరం ఆమెను కారుతో ఈడ్చుకెళ్లాడు. ఆమె మీద నుంచే కారును పోనిచ్చాడు. ఈ ఘటన ఢిల్లీలోని ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.చిల్లా గ్రామంలో ఇరుకు సందులో ఓ పోలీస్ కారుతో వేగంగా దూసుకొచ్చాడు. అయితే తాగి ఉన్నాడు. ఆ మత్తులో ఓ మహిళను ఢీకొన్నాడు. రోడ్డు దాటుతున్న ఆమెను ఢీకొట్టి ఆగాడు. అనంతరం ఆమెను స్థానికులు పైకి లేపుతుండగా ఆ పోలీస్ కారును వెంటనే తీశాడు. మళ్లొసారి కారు వేగం పెంచి ఆమెను తొక్కుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన స్థానికులు కారును ఆపి అతడిని పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన మహిళ చావు బతుకుల మధ్య పోరాడుతోంది. ఈ ఘటన సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీన్ని చూసి అందరూ షాకయ్యారు. ఆ పోలీస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.