Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్ గా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు.. రష్యాలో ఉన్నోడికి తెలిసిందా?

By:  Tupaki Desk   |   5 Jun 2021 6:30 AM GMT
హాట్ టాపిక్ గా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు.. రష్యాలో ఉన్నోడికి తెలిసిందా?
X
కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి మోడీ సర్కారు వైఫల్యాన్ని ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రపంచాన్ని వణికించిన మహమ్మారికి చెక్ పెట్టే టీకా విషయంలో ప్రధాని మోడీ ఫెయిల్ కావటం తెలిసిందే. సరైన సమయంలో సరైన రీతిలో ఆయన స్పందించి ఉంటే.. ఇవాల్టిరోజున సెకండ్ వేవ్ ఇంత తీవ్రంగా ఉండేది కాదు. దేశం కూడా ఇంతటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు. వేలాది కుటుంబాలు తమ వారిని కోల్పోయి విషాదంలో మునిగిపోయిన పరిస్థితి. అధికారికంగా వెల్లడైన మరణాలతో పోలిస్తే.. అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా వాస్తవ పరిస్థితి ఉందన్న వార్తలు.. ఆ వాదనను బలపరిచే గణాంకాలతో విశ్లేషిస్తూ కథనాలు అక్కడక్కడా వస్తున్నాయి.

వ్యాక్సిన్ కొరతపై దేశ ప్రజలు మాత్రమే కాదు.. న్యాయస్థానాలు సైతం తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. వ్యాక్సిన్ తయారీ విషయంలో దేశంలో ఉన్న అవకాశాల్ని మోడీ సర్కారు చేజేతులారా మిస్ చేసుకుందా? అన్న భావన కలగక మానదు. మేకిన్ ఇండియా అంటూ చెప్పే మోడీ హయాంలోనే ఇలాంటి పరిస్థితి ఉండటం దేనికి నిదర్శనం?

కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు అందరికి వ్యాక్సిన్ ఇవ్వటానికి మించింది మరో మార్గం లేదన్న విషయాన్ని నిపుణులు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. భారత్ లో వ్యాక్సిన్ తయారు చేసే స ంస్థల గురించి రష్యాలో ఉన్న వ్యక్తికి తెలిలసింది కానీ కేంద్రానికి తెలియదా? అంటూ విస్మయానికి గురి చేసింది. స్పుత్నిక్ వ్యాక్సిన్ ను భారత్ లో తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న పనేసియా బయోటెక్ కు సంబంధించిన ఒక పిటిషన్ విచారణపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఎక్కడో రష్యాలో ఉన్న ఒక వ్యక్తి హిమాచల్ ప్రదేశ్ లోని వ్యాక్సిన్ తయారీ సంస్థను గుర్తించారు. కానీ.. అలా చేయటంలో కేంద్రం విఫలమైందని పేర్కొంది. దేశంలో వనరులు ఉన్నప్పటికి వ్యాక్సిన్ తయారీలో వాటిని కేంద్రం సరిగా వినియోగించటం లేదన్న అభిప్రాయాన్ని వెలుబుచ్చింది. నిజమేకదా.. అక్కడెక్కడో రష్యాలోని వారికి భారత్ లో స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారు చేసే వారి వివరాలు సేకరించి.. వారితో ఒప్పందాలు కుదుర్చుకోవటానికి సిద్ధమైనప్పుడు.. దేశీయంగా డెవలప్ చేసిన వ్యాక్సిన్ ను భారీ స్థాయిలో ఉత్పత్తి అయ్యేలా ఏడాది క్రితమే ప్రణాళికలు రచించి ఉంటే.. ఈ రోజున కొరత సమస్య వచ్చేదే కాదు.. సెకండ్ వేవ్ ఇంత శోకాన్ని మిగిల్చేది కాదు.