Begin typing your search above and press return to search.

కాలుష్యం ఎఫెక్ట్.. ఢిల్లీలో విద్యార్థుల పరిస్థితి ఇదీ!

By:  Tupaki Desk   |   18 Nov 2019 9:54 AM GMT
కాలుష్యం ఎఫెక్ట్.. ఢిల్లీలో విద్యార్థుల పరిస్థితి ఇదీ!
X
చలికాలం వచ్చేసింది.. ఢిల్లీని వాయుకాలుష్యం కమ్మేసింది. ప్రపంచంలోనే అత్యంత వాయుకాలుష్య నగరంగా ఢిల్లీ మారిపోయింది. అక్కడ నివాసం ఉంటున్న వారు గాలీ పీల్చాలంటేనే కష్టంగా మారిపోయింది. అక్కడ క్రికెట్ ఆటగాళ్లు కూడా ముక్కులకు మాస్క్ లతో క్రికెట్ ఆడాల్సిన పరిస్థితి.

ఇక ఢిల్లీలో వాయు కాలుష్యం ఇప్పుడు ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా మారడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. చిన్నారుల పరిస్థితి చెప్పలేని విధంగా ఉంది. పిల్లలు బయటకు వస్తే ఖచ్చితంగా అనారోగ్యం బారిన పడేలా పరిస్థితి ఉంది.

వాయుకాలుష్యం కారణంగా ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం తాజాగా నవంబర్ లో చాలా రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. కానీ ప్రకటించిన సెలవులను భర్తీ చేసే ప్రక్రియను మాత్రం చేపట్టలేదు. దీంతో విద్యార్థుల చదువులకు నష్టం వాటిల్లుతోంది.

పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్యుల సూచనల మేరకు పేరెంట్స్ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నాయి. ప్రతీ సంవత్సరం నవంబర్ మొదటి రెండు వారాల్లో పాఠశాలలకు ‘స్మోగ్ బ్రేక్’ షెడ్యూల్ చేయాలని నేషనల్ కాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) ను చాలా మంది తల్లిదండ్రులు కోరారు.. కాలుష్య వెదజల్లే చలికాలంలో పిల్లలను స్కూలుకు పంపమని.. ఇతర కాలాల్లో సెలవులను పొడిగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. లేకుంటే విద్యార్థులు నష్టపోతారని అంటున్నారు. మరి దీనిపై ఎన్సీఆర్, ఢిల్లీ ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయనేది ఆసక్తిగా మారింది.