Begin typing your search above and press return to search.

తెలంగాణ కేబినెట్ సమావేశంలో తాజాగా తీసుకున్న కీలక నిర్ణయాలివే

By:  Tupaki Desk   |   1 Aug 2021 12:34 PM GMT
తెలంగాణ కేబినెట్ సమావేశంలో తాజాగా తీసుకున్న కీలక నిర్ణయాలివే
X
దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు భిన్నంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు. సాధారణంగా ఆయన కేబినెట్ సమావేశాన్ని ఎప్పుడో కానీ ఏర్పాటు చేయరు. అందుకు భిన్నంగా.. ఇటీవల కాలంలో తరచూ మంత్రివర్గ సమావేశాన్నినిర్వహిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆయన నిర్వహించే కేబినెట్ భేటీ గంటల కొద్దీ కొనసాగటం ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది. కనీసం ఆరు గంటల నుంచి ఎనిమిది తొమ్మిది గంటల పాటు కూడా సాగే సందర్భాలు ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ తర్వాత మొదలైన సమావేశం కొన్ని సార్లు డిన్నర్ టైంకు ముగిసే పరిస్థితి.

గంటల పాటు సాగే బోలెడన్ని అంశాల మీద చర్చ జరుగుతుంటుందని చెబుతారు. ఈ రోజు కూడా కేబినెట్ భేటీ సాగుతోంది. ఒకవైపు హైదరాబాద్ మహానగరంలని పాత బస్తీ.. తదితర ప్రాంతాల్లో బోనాల సందడి నెలకొని ఉండగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్రగతిభవన్ లో సీరియస్ గా మంత్రివర్గ సమావేశాన్నినిర్వహిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల సమయానికి కూడా కేబినెట్ భేటీ సాగుతోంది. అయితే.. అప్పటికే మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు కొన్ని బయటకు వచ్చాయి. అవేమంటే..

- రైతులకు ఇస్తామని చెప్పిన రైతు రుణమాఫీ అంశంపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది రూ.50వేల లోపు రుణాల్ని మాఫీ చేయాలని నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు రూ.50వేల రుణమాఫీని పూర్తి చేయాలని డిసైడ్ చేశారు. దీంతో ఆరు లక్షల మంది రైతులకు లబ్థి చేకూరుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన పంట రుణ మాఫీ వివరాల్ని ముఖ్యమంత్రికి అధికారులు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

- కరోనా కేసుల నమోదు.. పెరుగుతున్న వైనంపై చర్చించటంతో పాటు.. మందులకు కొరత రాకుండా చూసుకోవటంతో పాటు.. ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలని పేర్కొన్నారు. జిల్లాల్లో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించాలన్న ఆదేశాలు జారీ చేశారు.
- కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలన్న ఆదేశం
- కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన వైద్య కళాశాలల్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొదలుపెట్టాలన్న నిర్ణయం
- కొత్త వైద్య కళాశాలలకు భవనాలు.. హాస్టళ్లు.. మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చ. ఫ్యూచర్ లో మంజూరు చేసే వైద్య కళాశాలలకు అవసరమైన భూముల్ని చూడాలన్న ఆదేశం.
- కొవిడ్ కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల పూర్తి వివరాల్ని అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి తెప్పించాలి.
- రాష్ట్రంలో అనాథలు.. అనాథ శరణాలయాల స్థితిగతులు.. సమస్యలు.. అవగామన కోసం ఒక సమగ్ర విధానానికి రూపకల్పన చేయాలి. ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీకి మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షత వహించాలి. సభ్యులుగా మంత్రులు కేటీఆర్.. హరీశ్.. సబితా ఇంద్రారెడ్డి.. శ్రీనివాస్ గౌడ్.. తలసాని శ్రీనివాస్ యాదవ్.. కొప్పుల ఈశ్వర్.. గంగుల కమలాకర్.. ఇంద్రకరణ్ రెడ్డి.. జగదీశ్ రెడ్డి.. ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యవహరిస్తారు.
- రాష్ట్రంలోని అన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు టిమ్స్ గా వ్యవహరిస్తారు.
- వరంగల్.. చెస్టు ఆసుపత్రి.. గడ్డి అన్నారం మార్కెట్.. అల్వాల్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు ఆమోదం. అన్ని రకాల వైద్య సేవలు ఒక్కచోట అందేలా వైద్య కళాశాలల ఏర్పాటు.
- పటాన్ చెర్వులో కార్మికుల కోసం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు.