కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్..!

Fri Mar 31 2023 16:00:24 GMT+0530 (India Standard Time)

Death as Mosquito Coil Sparks Fire

దోమల బెడద తప్పించుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందులో ఒకటి మస్కిటో కాయిల్స్. రాత్రి పడుకునే సమయంలో మంచం కింద.. లేదంటే ఏదో ఒక మూలన.. పక్కన మస్కిటో కాయిల్ వెలిగించి నిద్రపోతాం.మస్కిటో కాయిల్ నుండి వచ్చే పొగ చిన్న పిల్లలకు మంచిది కాదని చాలా రోజులుగా వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు అయినా కూడా కొందరు మస్కిటో కాయిల్ ని వాడుతున్నారు.

మస్కిటో కాయిల్ వల్ల పిల్లలకు మాత్రమే కాకుండా పెద్ద వారికి ప్రమాదమని ఢిల్లీలో జరిగిన విషాదకర సంఘటనతో నిరూపితం అయింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

మస్కిటో కాయిల్ కారణంగా మంటలు చెలరేగి ఆ తర్వాత విషపూరిత వాయువు వెలువడి ఆ వాయువుని పీల్చడం ద్వారా ఊపిరాడక ఒకే కుటుంబం లోని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి కూడా ఉండడం విషాదకరం.

మస్కిటో కాయిల్ నుండి మిరుగులు ఎగిరిపడి పరుపుపై పడి ఉంటాయని.. అది గమనించని కుటుంబ సభ్యులు అలాగే నిద్ర లో ఉండి ఉంటారని.. ఏసి వేసి ఉండడం వల్ల డోర్స్ క్లోజ్ చేసి ఉంచారని.. అందువల్ల దట్టమైన పొగలు అలుముకుని నిద్రలో ఉండగానే కుటుంబ సభ్యులంతా చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాద సమయంలో ఇంట్లో మొత్తం తొమ్మిది మంది ఉండగా ఆరుగురు విగత జీవులుగా కనిపించారు. మిగతా ముగ్గురు పోలీసులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఆ ముగ్గురు కూడా స్పృహ తప్పి పడిపోయారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.      


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.