Begin typing your search above and press return to search.

నటికి వైరస్ సైడ్ ఎఫెక్ట్స్‌..కాళ్ల‌ల్లో గ‌డ్డక‌ట్టిన రక్తం..రెండు కాళ్లు తొలగింపు!

By:  Tupaki Desk   |   12 Jun 2020 11:30 PM GMT
నటికి వైరస్ సైడ్ ఎఫెక్ట్స్‌..కాళ్ల‌ల్లో గ‌డ్డక‌ట్టిన రక్తం..రెండు కాళ్లు తొలగింపు!
X
చైనాలో పుట్టి ..ప్రపంచాన్ని వణికిపోయేలా చేస్తున్న ఈ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. పచ్చగా ఉండే మనుషులు జీవితాలను ఈ మహమ్మారి ఛిన్నా భిన్నం చేసేస్తోంది. ఈ వైరస్ భారిన పడినవారిలో కొందరు ప్రాణాలను కోల్పోతున్నారు. కొంతమంది ఈ మహమ్మారిని జయిస్తున్నారు.

అయితే, ఈ మ‌హ‌మ్మారి సోకి కోలుకుని క్షేమంగా ఇంటికి చేరినతరువాత కూడా వాళ్లు ప్రశాంతంగా ఉండలేక పోతున్నారు. పలు ఆరోగ్యం సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ నటి జుడీ ఎవాన్స్ కాళ్లను రెండు సార్లు కత్తిరించారు వైద్యులు.

డేస్ ఆఫ్ అవర్ లైఫ్స్’‌ షో ద్వారా మంచి గుర్తింపు సాధించిన ఎవన్స్.. గుర్రం నుంచి కింద జారీ పడ్డారు. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలోనే ఆమెకు కరోనా సోకింది. జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు వంటి లక్షణాలు ఆమెకు కనిపించాయి. ఇక వైరస్ వలన జుడి రెండు కాళ్లలో రక్తం కూడా గడ్డ కట్టింది. వాటిని తీసేందుకు ఆమె రెండు కాళ్లను రెండు సందర్భాల్లో కట్ చేశారు వైద్యులు.

ఈ విషయాన్ని వెల్లడించిన జుడి మేనేజర్.. ”23 రోజులుగా ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎవన్స్ కోలుకుంటున్నారు. కరోనా పరీక్షల్లో ఇంకా నెగిటివ్ రాలేదు. తనకు బావుండాలని కోరుకున్న అందరికీ ఆమె థ్యాంక్స్ చెప్పమన్నారు” అని తెలిపారు. కాగా హాలీవుడ్ న‌టుడు నిక్ కార్డెరోకి కూడా కరోనా సోకగా.. దాని వలన ఆయన కుడికాలి రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టి స‌ప‌రేట్ పార్ట్‌ గా అయ్యింది. దీనితో వైద్యులు తప్పని పరిస్థితుల్లో అతని కాలును తొలగించిన విషయం తెలిసిందే.