Begin typing your search above and press return to search.

కొడుకు పుట్టాడని స్వీట్స్ పంచి కరోనా అంటించాడు !

By:  Tupaki Desk   |   8 July 2020 12:30 AM GMT
కొడుకు పుట్టాడని స్వీట్స్ పంచి కరోనా అంటించాడు !
X
దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి మరింత గా విజృంభిస్తుంది. ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి . అసలు ఈ కరోనా నేపథ్యంలో ఎవరిని నమ్మలేకున్నాం. ఎవరికీ కరోనా ఉందో ..ఎవరికీ కరోనా లేదో తెలుసుకోవడం కూడా కష్టమైంది. తాజాగా కరోనా మహమ్మారుతో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో మరోసారి అందరికి తెలియజేసే ఘటన జరిగింది. ఏమిటి అంటే కొడుకు పుట్టాడనే ఆనందం లో స్పీట్స్ పంచిన ఓ వ్యక్తి, తన ద్వారా 10 మంది కి కరోనా అంటించాడు. హైదరాబాద్ లోని చిక్కడపల్లి లో జరిగింది ఈ ఘటన. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. వీళ్లంతా పోలీసులే అంటూ ప్రసార మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.

పూర్తి వివరాలు .. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిథి లో పనిచేసే ఓ కానిస్టేబుల్ కు కొడుకు పుట్టాడని, ఆ ఆనందాన్ని కానిస్టేబుల్ ఇతర పోలీసులతో పంచుకున్నాడని,అలాగే స్వీట్స్ తెచ్చి అందరికీ పంచాడని, అలా స్వీట్స్ తిన్న 10 మంది పోలీసులకు కరోనా వచ్చిందని , కొడుకు పుట్టాడనే ఆనందంలో ఉన్న కానిస్టేబుల్ కు కరోనా లక్షణాల్లేవు అని , కానీ అతడికి కరోనా సోకిందని, అతడి తమ్ముడి ద్వారా కరోనా సోకినట్టు పోలీసులు భావిస్తున్నారని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.

అలా లక్షణాలు లేకుండానే 10 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ వ్యవహారం పై పోలీసు ఉన్నతాధికారులు స్పందించలేదు. అయితే పోలీసులతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులందర్నీ హోం క్వారంటైన్ లో ఉంచి , అందర్నీ ఇళ్లలోనే ఉంచి చికిత్స అందిస్తున్నట్టు ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించలేదు. పోలీసులతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులందర్నీ హోం క్వారంటైన్ లో ఉంచారు. అందర్నీ ఇళ్లలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.హైదరాబాద్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ఎవ్వరూ బయటకు రావొద్దని, మాస్కులు పెట్టుకోవాలని, పార్టీలు-వేడుకలు చేయొద్దని పోలీసులు చెబుతున్నారు.