Begin typing your search above and press return to search.

బెంగుళూరు నుండి వస్తే గ్రామాల్లోకి నో ఎంట్రీ ... 5 వేలు ఫైన్ ?

By:  Tupaki Desk   |   8 July 2020 9:30 AM GMT
బెంగుళూరు నుండి వస్తే గ్రామాల్లోకి నో ఎంట్రీ ... 5 వేలు ఫైన్  ?
X
కర్ణాటక ..ప్రస్తుతం కరోనా మహమ్మారికి హాట్ స్పాట్ గా మారుతుంది. మొదట్లో కరోనా మహమ్మారిని కర్ణాటక ప్రభుత్వం బాగానే ఎదుర్కొంది. కానీ , దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఆన్ లాక్ 1 ప్రారంభం కావడం..విమాన ప్రయాణాలు కూడా ప్రారంభం కావడంతో కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో బెంగుళూరు సిటీలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో ఇప్పుడు బెంగుళూరు అని చెప్తేనే అందరూ భయంతో వణికిపోతున్నారు. కొన్ని కొన్ని గ్రామాల్లో బెంగుళూరు నుండి వచ్చిన వాహనాలను తమ్ గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు.

బెంగుళూరులో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో మైసూర్ మధ్యలో గల మాండ్యలో గల ఒక పంచాయతీ ప్రజలందరూ కలిసి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగుళూరు , మైసూర్ నుండి ఎవరు వచ్చినా ఊర్లోకి అనుమతి లేదు అని, ఆలా కాదు అని నిబంధనల్ని అతిక్రమించి గ్రామంలోకి వస్తే రూ . 5 వేలు ఫైన్ కట్టాలని ప్రకటించారు. ఈ విధానాన్ని చాలా గ్రామాల్లో పాటిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర కర్ణాటక ప్రాంతంలో గల కొన్ని గ్రామాల ప్రజలు బెంగుళూరు వంటి కరోనా హాట్ స్పాట్ ప్రాంతనాల నుండి వచ్చేవారిని తమ గ్రామంలోకి రానివ్వకుండా .. గ్రామ పొలిమేర్లలో కాపలా కాస్తున్నారు. బెంగుళూరు రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ..అక్కడి నుండి వచ్చే వారికీ కరోనా ఉండే అవకాసం ఉండటంతో ఆ గ్రామ ప్రజలు అలా చేస్తున్నారు.

కాగా , కర్ణాటక లో ఇప్పటివరకు 26,815 మంది కరోనా భారిన పడ్డారు. వారిలో 11,098 మంది ఇప్పటికే కరోనా నుండి కోలుకోగా .. 416 మంది మృతి చెందారు. ప్రతి రోజూ కర్ణాటక లో వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా బెంగుళూరు సిటీలోనే నమోదు అవుతున్నాయి. ఈ తరుణంలోనే ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ ను కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తుంది.