దేశంలో తగ్గుతున్న కొవిడ్ కేసులు.… కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే ?

Wed Jun 09 2021 11:00:09 GMT+0530 (IST)

Dangerous Disease In India

మనదేశంలో కరోనా వైరస్ మహమ్మారి  పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. అయితే ఈ సెకండ్ వేవ్ మొదలైన తర్వాత ఇంత తక్కువ రేంజ్ లో కరోనా వైరస్ మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. సెకండ్ వేవ్ మొదలైన మొదట్లో నాలుగు లక్షలకి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా తగ్గుతవస్తున్నాయి. ఇదిలా ఉంటే .. తాజాగా దేశంలో గత 24 గంటల్లో  92596 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.గత  24 గంటల్లో 1985967 కరోనా నిర్ధారణ పరీక్షలు జరపగా 92596 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇదిలా ఉంటే వరుసగా రెండో రోజు లక్ష కంటే తక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం. నిన్న 2219 మంది వైరస్ వల్ల మరణించగా  దేశంలో మొత్తం మరణాల సంఖ్య 353528కి చేరింది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2 కోట్ల 90 లక్షలకు చేరింది. ప్రస్తుతం 1231415 యాక్టివ్ కేసులు ఉండగా 27504126 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు ఇప్పటిదాకా 239058360 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది.