Begin typing your search above and press return to search.

ఇండియా కరోనా అప్డేట్ : ఒక్కరోజులో ఎన్నంటే ?

By:  Tupaki Desk   |   29 Sep 2020 7:00 AM GMT
ఇండియా కరోనా అప్డేట్ : ఒక్కరోజులో ఎన్నంటే ?
X
భారత్‌ లో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 61 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 70,589 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 61,45,292 కి చేరింది.గ‌త 24 గంట‌ల సమయంలో 776 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీనితో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 96,318 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 51,01,398 మంది కోలుకున్నారు. 9,47,576 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇండియాలో నిన్న 1142811 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 7కోట్ల 31లక్షల 10వేల 41కి చేరింది.

ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా తర్వాత ఇండియా టాప్ 2లో ఉంది. రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇండియా మొదటి స్థానంలో కొనసాగుతోంది. అలాగే... మొత్తం మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్... మూడో స్థానంలో ఉంది. రోజువారీ నమోదవుతున్న కరోనా మరణాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత బ్రెజిల్, అర్జెంటినా, అమెరికా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య పది లక్షలు దాటింది. మంగళవారం నాటికి జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 1,001,646 మంది మరణించారు. గత మూడు నెలల్లోనే వైరస్ మరణాల రేటు రెట్టింపు అయినట్లు రైటర్స్ సంస్థ పేర్కొన్నది.