Begin typing your search above and press return to search.

ఇండియా లో 20 లక్షలు, ఏపీలో 2 లక్షలు .. కరోనా విలయతాండవం !

By:  Tupaki Desk   |   8 Aug 2020 7:10 AM GMT
ఇండియా లో 20 లక్షలు, ఏపీలో 2 లక్షలు .. కరోనా విలయతాండవం !
X
ప్రపంచ దేశాలను వణికిపోయేలా చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్ లో కూడా పంజా విసురుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభంలో దేశంలో తక్కువగా ఉన్నప్పటికీ గత కొన్నిరోజులుగా భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 61,537 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్క రోజులు దేశంలో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే. అదే సమయంలో 933 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 20,88,612కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 42,518కి పెరిగింది. 6,19,088 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 14,27,006 మంది కోలుకున్నారు.

ఇకపోతే , ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గడచిన కొన్ని రోజులుగా రోజూ 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా శుక్రవారం నాడు కూడా ఏపీలో 10,171 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో తాజాగా నమోదు అయిన కేసులతో కలిసి ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. ఇక, తెలంగాణలో కొత్తగా 2256 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 77513కి పెరిగింది. గత 24 గంటల్లో 14 మంది ప్రాణాలు విడిచారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 615కి పెరిగింది. తాజాగా తెలంగాణలో గత 24 గంటల్లో 1091 మంది రికవరీ అయ్యారు. ఫలితంగా మొత్తం రికవరీ కేసుల సంఖ్య 54330గా ఉంది. రికవరీ రేటు దేశంలో 67.98గా ఉంటే, తెలంగాణలో 70.09గా ఉందని ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 22568గా ఉన్నాయి. వాటిలో 15830 మంది ఇళ్లలోనే ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.