దేశంలో కరోనా జోరుకి బ్రేకుల్లేవ్ ... కొత్త కేసులు ఎన్నంటే?

Wed Jul 08 2020 16:15:14 GMT+0530 (IST)

Dangerous Disease In India

భారత్ లో కరోనా మహమ్మారి జోరు రోజురోజుకి బ్రేకులు లేకుండా కొనసాగుతుంది. దేశంలో రోజు రోజుకి నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకూ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7.43 లక్షలకు చేరింది. తాజాగా... 22752 కేసులు నమోదవ్వడంతో... మొత్తం కేసుల సంఖ్య 742417కి చేరింది. అలాగే... తాజాగా 482 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 20642కి చేరింది. అలాగే మొత్తం రికవరీల సంఖ్య 456830కి చేరింది.  ప్రస్తుతం 264944 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇక  తెలంగాణలో కొత్తగా 1879 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ ఎం  సీ  పరిధిలో 1422 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27612కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 16287 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. హైదరాబాద్ పరిసర జిల్లాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వైరస్ జాడలు విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇక  ఏపీలో 1178 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 1155 కేసులు ఇతర రాష్ట్రాలు విదేశాల నుంచి వచ్చిన వారిలో 23 కేసులు బయటపడ్డాయి. తాజా లెక్కలతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21197కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 9745 మంది కోలుకోగా  ఇప్పటి వరకు 252 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 11200 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.