Begin typing your search above and press return to search.

కరోనా పోరులో ఏపీ మరో కీలక ముందడుగు ..ఏంటంటే ?

By:  Tupaki Desk   |   10 July 2020 2:36 PM GMT
కరోనా పోరులో ఏపీ మరో కీలక ముందడుగు ..ఏంటంటే ?
X
ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ , ఎక్కువగా కరోనా నిర్దారణ పరీక్షలు చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడిలోకి రాలేదు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన మొదట్లో కరోనా ను ఏపీ ప్రభుత్వం అంత సీరియస్ గా తీసుకోలేదు. అయితే , ఆ తరువాత వ్యాధి తీవ్రతని పసిగట్టి దానికి తగ్గ ఏర్పాట్లని చేసింది. ప్రస్తుతం కరోనా పోరులో వేగంగా చర్యలు తీసుకుంటున్న రాష్ట్రాలలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

కరోనాను ఎలాగైనా రాష్ట్రంలో అరికట్టాలని సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నిర్దారణ పరీక్షలు చేయాలనీ అధికారులని ఆదేశించారు. ఇతర దేశాల నుండి కరోనా ర్యాపిడ్ కిట్స్ తెప్పించి..రాష్ట్రంలో విస్తృతంగా పరీక్షలు చేస్తున్నారు. ప్రజల వద్దే వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే , కరోనా ఏ మాత్రం తగ్గకపోవడంతో వైరస్ నిర్దారణ పరీక్షలు పెంచాలని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒకరికి కచ్చితంగా కరోనా టెస్టు చేయాలని ఏపీ సర్కారు భావిస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఏపీలో కరోనా టెస్టుల కోసం ప్రభుత్వం సంజీవని పేరుతో 50కి పైగా బస్సులను ప్రవేశపెట్టింది.

ఈ సంజీవిని బస్సుల్ని కేవలం కరోనా టెస్టులని చేయడం కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ అధికారులు అన్ని రకాల హుంగులతో తీర్చిదిద్దారు. ఈ బస్సులు జిల్లా కి నాలుగు చొప్పున వెళ్తాయి. ఆలా జిల్లాకి వెళ్లిన బస్సుల్లో ఆ జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న గ్రామాల్లో ముందుకు కుటుంబంలో ఒకరికి చొప్పున కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తరువాత ఆ జిల్లాలో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికి ఆ బస్సులోనే ఫ్రీ గా కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఈ సంజీవిని బస్సులు చేరాయి. మొత్తంగా ఇంటికొకరుచొప్పున రాష్ట్రంలో కోటికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.