Begin typing your search above and press return to search.

ఎంతవారలైనా కాంత దాసులే..హనీట్రాప్​ లో పడ్డ డీఆర్​ డీఏ సైంటిస్ట్​!

By:  Tupaki Desk   |   29 Sep 2020 11:30 PM GMT
ఎంతవారలైనా కాంత దాసులే..హనీట్రాప్​ లో పడ్డ డీఆర్​ డీఏ సైంటిస్ట్​!
X
ఎంతవారలైనా కాంత దాసులే అంటుంటారు పెద్దలు.. ఇటువంటిదే ఓ డీఆర్​డీఏ శాస్త్రవేత్త కథ. ఆయన ప్రభుత్వ రంగసంస్థలో పెద్ద ఉద్యోగి. మంచి చెడు తెలిసిన వాడు. కానీ చివరకు ఓ అమ్మాయి విసిరిన వలపు వలకు పడిపోయాడు. అమ్మాయిని అడ్దంపెట్టుకొని జూనియర్​ సైంటిస్ట్​ను ఓ ముఠా కిడ్నాప్​ చేసింది. రూ.10 లక్షలు తీసుకొస్తే విడిచిపెడతామని సైంటిస్ట్​ కుటుంబాన్ని బెదిరించింది. చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఈ గ్యాంగ్​ ఆటకట్టించారు. ఇంతకు ఎక్కడ.. ఏం జరిగిందంటే.. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి (35) కేంద్ర రక్షణ రంగ సంస్ధల్లో (డీఆర్​డీఏ) లో జూనియర్​ సైంటిస్ట్​గా పనిచేస్తున్నాడు. ఇతడి కుటుంబం నొయిడా సెక్టార్ 77 లో ఉంటోంది. అయితే ఈ జూనియర్​ సైంటిస్ట్​ మహిళలతో మసాజ్ చేసే స్పా సెంటర్లు ఢిల్లీలో ఎక్కడైనా ఉన్నాయా అని ఇంటర్నెట్​లో వెతికాడు.

ఈ క్రమంలో అతడికి అనిల్ కుమార్ శర్మ ఇంటర్​నెట్​లో తారసపడ్డాడు. మీరు కోరిన విధంగా మేము అందమైన యువతులతో మసాజ్​ చేయిస్తామని అతడు నమ్మబలికాడు. అనంతరం కొందరు అమ్మాయిలతో మాట్లాడించాడు. దీంతో సదరు ఉద్యోగి ట్రాప్​లో పడిపోయాడు. అయితే సదరు వ్యక్తి శనివారం సాయంత్రం నోయిడాలోని సిటీ సెంటర్ వద్దకు రావాల్సిందిగా సైంటిస్టుకు సూచించాడు. దీంతో తాను షాపింగ్​ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఉద్యోగి వెళ్లిపోయాడు. సిటీ సెంటర్​కు తన హోండా సిటీ కారులో వెళ్లాడు. కారు అక్కడ వదిలి తాను చెప్పిన వ్యక్తితో వెళ్తే మీరు కోరిన సేవలు లభిస్తాయని అనిల్ కుమార్ శర్మ చెప్పటంతో, సైంటిస్ట్ కారు అక్కడే వదిలి అనిల్ చెప్పిన వ్యక్తితో వేరే కారులో వెళ్లాడు. అక్కడి నుంచి వారు భివానీలోని ఓయో హోటల్ కు వెళ్లారు. అక్కడ దీపక్ కుమార్, సునీతా గుర్జార్, అలియాస్ బబ్లీ, రాకేష్ కుమార్, మన్వీర్ గుర్జార్ ,మరో ఇద్దరు వ్యక్తులు సైంటిస్ట్ పై దాడి చేసి బంధించారు. అతని భార్యకు ఫోన్ చేసి రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు అతడి భార్య పోలీసులను ఆశ్రయించింది.

రంగంలోకి దిగిన పోలీసులు మొబైల్​ సిగ్నల్​ ఆధారంగా ట్రాక్​ చేసి నిందితులను అదుపులోకి తీసుకొని జూనియర్​ సైంటిస్ట్​ను విడిపించారు. పట్టుబడిన వారిలో ఒక మహిళ నోయిడాకు చెందిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి అనుచరురాలిగాను, బిగ్ బాస్ 10 విజేత కు బంధువుగాను గుర్తించారు. రాకేష్ కుమార్ ఓయో హోటల్ నిర్వాహకుడిగా పోలీసులు తెలిపారు. సైంటిస్టును రక్షించినందుకు గౌతమ బుధ్ధ నగర పోలీసు కమీషనరేట్ కు కేంద్ర హోంశాఖ 5 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. హనీ ట్రాప్​ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.