ముంబైలో పవర్‌కట్ వెనక సైబర్‌నేరగాళ్లు..! మహానగరంలో మాయ!

Sat Nov 21 2020 14:00:45 GMT+0530 (IST)

Cyber ??criminals behind power cut in Mumbai

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అక్టోబర్ 12న కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అనూహ్యంగా నిలిచిపోయింది. విద్యుత్ అధికారుల ప్రమేయం లేకుండానే పవర్ కట్ అయ్యింది. అయితే దీని వెనుక భారీ కుట్ర ఉన్నట్టు సైబర్‌క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. సింగపూర్ సహా దక్షిణాసియాలోని కొన్ని దేశాలకు చెందిన హ్యాకర్లు.. ముంబై పవర్ సప్లై ట్రాన్స్మిషన్ సర్వర్లలో లాగిన్ అయి పవర్‌ను తీసేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వారు ఎందుకోసం ఇలా చేశారు. దీంట్లో దాగి ఉన్న కుట్ర ఏమిటి అని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఉన్నట్టుండి ముంబై నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగరంలోని పలు కీలక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా జరగలేదు.  దీంతో కొన్ని ప్రాంతాల్లో లోకల్ రైళ్లు నిలిచిపోయాయి.  టాటా నుంచి విద్యుత్ సరఫరా స్తంభించినట్లు బృహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ పేర్కొన్నది. చర్చ్‌గేట్ నుంచి వాసాయి రైల్వే స్టేషన్ మధ్య నడిచే లోకల్ రైళ్లను నిలిపేశారు.  విద్యుత్ సమస్యపై నగరప్రజలు ట్వీట్లు కూడా చేశారు. సౌత్ సెంట్రల్ నార్త్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సంపూర్ణంగా నిలిచిపోయినట్లు సమాచారం.

 400 కేవీ లైన్ ట్రిప్ అయినట్లు సమాచారం. అయితే ఆ ఎలక్ట్రిక్ లైన్‌ను పునరుద్దరిస్తున్నారు.  పవర్‌గ్రిడ్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది.  ఎంఐడీసీ పాల్గర్ దహనూ లైన్లలో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ముంబై నగరానికి వెళ్తున్న 360 మెగా వాట్ల పవర్ సరఫరాకు అంతరాయం కలిగినట్లు సమాచారం. బీఎస్ఈ ఎన్ఎస్ఈలు మాత్రం ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. కానీ పలు రైల్వే స్టేషన్లలో ఎలక్ట్రిక్ సరఫరా లేక రైళ్లు ఆగిపోయాయి. అయితే ఇదంతా హ్యాకర్ల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతున్నది.