Begin typing your search above and press return to search.

ఫిఫాలో మెరిసిన బ్యూటీ.. భారీ అందాలతో రచ్చ.. ఫొటోలు వైరల్..!

By:  Tupaki Desk   |   10 Dec 2022 2:30 AM GMT
ఫిఫాలో మెరిసిన బ్యూటీ.. భారీ అందాలతో రచ్చ..  ఫొటోలు వైరల్..!
X
2022 ఫుట్ బాల్ వరల్డ్ కప్ (ఫిఫా) పోటీలకు ఖతార్ ఆతిథ్యం ఇస్తుంది. నవంబర్ 20 నుంచి ప్రారంభమైన ఫుట్ బాల్ మ్యాచ్ డిసెంబర్ 18తో ముగియనుంది. ఈ క్రమంలోనే ప్రీ క్వార్టర్స్ దశ నుంచి పుట్ బాల్ మ్యాచ్ లు క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాయి. నేడు బ్రెజిల్.. క్రొయోషియా మధ్య జరిగే మ్యాచ్ తో ప్రీ క్వార్టర్ ఫైనల్ దశ ముగియనుంది.

రేపటి నుంచి క్వార్టర్ పైనల్స్.. ఆ తర్వాత సెమి ఫైనల్.. ఫైనల్ మ్యాచ్ లు జరుగనున్నాయి. అయితే ఈసారి ఫిపా వరల్డ్ కప్ ముస్లిం దేశమైన ఖతార్ లో జరుగుతుండటంతో గత టోర్నీల మాదిరిగానే అభిమానులు స్వేచ్ఛగా మ్యాచులను చూడలేకపోతున్నారు. ఈ టోర్నీలో అభిమానులు గతంలో మాదిరిగానే అందచందాలతో కూడిన అదనపు ఆకర్షణలను మిస్సవుతున్నారు.

దీనికితోడు కనీసం బీరు కూడా తాగేందుకు అనుమతించడం లేదని అభిమానులు తెగ బాధపడుతున్నారు. అయితే వీరి బాధలు నిర్వాహకుల దృష్టికి వెళ్లడంతో ఖతార్ లో నూ క్రమంగా ఆంక్షల విషయంలో కాస్త సడలింపులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఖతార్ లో మ్యాచ్ లు చూసేందుకు అభిమానులు సైతం బారులు తీరుతున్నారు.

ఈసారి ఫుట్ బాల్ మ్యాచుల్లో అంద చందాలకు దూరమై కరువులో ఉన్న ఫ్యాన్స్ కు క్రొయోషియా బ్యూటీ ఇవానా నోల్ ఊరటనిచ్చింది. క్రొయేషియా-మెక్సికో దేశాల మధ్య జరుగుతున్న ప్రీ క్వార్టర్ మ్యాచ్ కు హాజరైన ఈ బ్యూటీ ఖతార్ చట్టాలను ఏమాత్రం లెక్క చేయకుండా తన అందచందాలను స్టాండ్స్ లో ప్రదర్శించి అభిమానుల మనసులు దోచేసింది.

ఇవానా భారీ అందాలకు ఖాతార్ అభిమానులు సైతం ఫిదా అయి ఫోటోలను తీశారు. ఈ ఫోటోలను తన ట్విట్టర్లో పోస్టు చేసి ‘థ్యాంకూ యువర్ సపోర్ట్’ ఇవానా రాసుకొచ్చింది. అయితే ఈ ఖతార్ అభిమానులు ఆమె ఫొటోలను సరదాగా తీయలేదని తనపై కేసు పెట్టేందుకు ఫోటోలు తీశారంటూ ఒక వ్యాపారి ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఖతార్ లో ఒళ్ళు కనబడేలా డ్రెస్సులు ధరించడం నేరంగా పరిగణిస్తారు. ఈ క్రమంలోనే ఖాతర్ చట్టాలపై ఇవానా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన వద్ద ఒళ్లు కప్పుకునే దుస్తులేమీ లేవని అంటున్నారు. తాను ముస్లిం కాకపోయినప్పటికీ ఒక యూరోపియన్ అని.. వారి హిజమ్.. నిఖబ్ ను గౌరవిస్తానని చెప్పారు.

అలాగే తమ మతం ప్రకారం తనకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చని.. బికినీస్‌ కూడా ధరించవచ్చని ఇవానా స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే జర్మనీకి చెందిన ఇవానా నోల్ ఏడేళ్ల వయస్సులోనే క్రొయోషియాకు వలస వెళ్లింది. ప్రస్తుతం ఆమె ఇన్ స్ట్రా గ్రామ్ ఖాతాలో ఒక మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.