Begin typing your search above and press return to search.

పూజ‌ కు ప‌నికిరాని ఎంపీలు... మోడీ పై మేధావుల విమ‌ర్శ‌

By:  Tupaki Desk   |   28 May 2023 2:10 PM GMT
పూజ‌ కు ప‌నికిరాని ఎంపీలు... మోడీ పై మేధావుల విమ‌ర్శ‌
X
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పై మేధావులు మ‌రోసారి విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవంతిని ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క‌రే ప్రారంభించ‌డం... ఈ కార్య‌క్ర‌మానికి ఇంకెవ్వ‌రినీ ఆహ్వానించ‌క‌పోవ‌డం.. వంటివి మేధావుల విమ‌ర్శ‌ల‌తో త‌డిసి ముద్ద‌వుతున్నాయి. దేశంలో 547 మంది ప్ర‌జ‌లు ఎన్నుకున్న ఎంపీలున్నా.. ఒక్క‌రంటే ఒక్క‌రికి కూడా ప్రాధాన్యం ద‌క్క‌క‌పోవ‌డాన్ని బ‌ట్టి.. వీరంతా పూజ‌కు ప‌నికిరాని పూలా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

ఇక‌, పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌ కు చేరుకున్న ప్ర‌ధాన మంత్రి మోడీ కి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా(ఈయ‌న కూడా ఒక్క‌రే) స్వాగతం పలికారు. అనంతరం గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా నూతన భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన పూజా స్థలికి చేరుకున్నారు. అక్కడ ఆయన కు వేదపండితు లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అక్కడే చేసిన హోమంలో పాల్గొన్నారు.

దీంతో పార్లమెంటు నూతన భవంతి ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా మొదలైంది. అనంతరం వేదపండితులు శాలువా కప్పి ప్రధానికి ఆశీర్వచనాలు అందజేశారు. నిజాని కి ఎక్క‌డైనా ప్ర‌జ‌ల సొమ్ముతో నిర్మించిన వాటికి క‌నీసం ప్రొటోకాల్ పాటించాల‌నేది సంప్ర‌దాయం. కానీ, పార్ల‌మెంటు విష‌యంలో ఎలాంటి ప్రొటోకాల్‌ కు ప్రాధాన్యం ద‌క్క‌లేద‌ని మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మ‌రోవైపు సొంగోల్ రాజదండానికి తమిళనాడు నుంచి వచ్చిన మఠాధిపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం నుంచి నేరుగా సెంగోల్‌ దగ్గర కు చేరుకున్న ప్రధాని మఠాధిపతుల కు నమస్కరించారు. అనంతరం సెంగోల్‌ కు సాష్టాంగ నమస్కారం చేశారు. తర్వాత మఠాధిపతులు సెంగోల్‌ ను ప్రధాని మోడీ చేతికి అందజేశారు. అనంతరం మఠాధిపతులు వెంటరాగా నాదస్వరం, భజంత్రీల మధ్య ప్రధాని దాన్ని లోక్‌సభ లోకి తీసుకెళ్లారు. అక్కడ స్పీకర్‌ ఓం బిర్లా సమక్షంలో దాన్ని స్పీకర్‌ ఆసనం పక్కన ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

లోక్‌సభ నుంచి తిరిగి ప్రధాని పూజాస్థలికి చేరుకున్నారు. అక్కడ శిలాఫలకాన్ని ఓం బిర్లా సమక్షంలో(ఇక్క‌డ కూడా ఎవ‌రూ లేరు) ఆవిష్కరించి నూతన పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేశారు. అనంతరం పార్లమెంటు భవన నిర్మాణంలో పాల్గొన్న పలువురు కార్మికుల ను శాలువాతో సత్కరించారు. జ్ఞాపికలను బహూకరించారు.