Begin typing your search above and press return to search.

సునంద కేసు:అర్నాబ్ గోస్వామిపై ఎఫ్ ఐ ఆర్

By:  Tupaki Desk   |   12 Feb 2019 6:12 AM GMT
సునంద కేసు:అర్నాబ్ గోస్వామిపై ఎఫ్ ఐ ఆర్
X
అనుమానాస్పదంగా మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి శశిధరూర్ భార్య సునంద పుష్కర్ ఉదంతంలో ఇప్పటికీ విచారణ కొనసాగుతూనే ఉంది. కొన్నేళ్లుగా ఆమెది ఆత్మహత్యా.? హత్యా అన్నది తేలడం లేదు. తాజా అప్ డేట్ ఏంటంటే.. శశిథరూర్ రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిపై ఫిర్యాదు చేశారు. కోర్టులో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. తన భార్యకు సంభందించిన రహస్య పత్రాలను ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పేరుతో బహిర్గతం చేయడంపై శశిథరూర్ కోర్టులో ఫిర్యాదు చేశారు.

తన భార్యకు సంబంధించిన రహస్యాలను ఇన్వెస్టిగేషన్ పేరుతో అర్నాబ్ గోస్వామిపై బహిర్గతం చేశాడని శశిథరూర్ కోర్టులో వేసిన పిటీషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా తన రిపబ్లిక్ టీవీలో తనను, తన భార్యను అవమానించేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని విన్నవించాడు. తన చానల్ వ్యూయర్ షిప్ పెంచుకునేందుకు తన వ్యక్తిగత జీవితాన్ని అభాసుపాలు చేశాడని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా రిపబ్లిక్ టీవీలో తనపై ప్రసారమైన కథనాల వీడియోలను ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు అందజేసి చర్యలు తీసుకోవాలని శశిథరూర్ కోరారు.

లోక్ సభ ఎంపీ అయిన శశిథరూర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని న్యూఢిల్లీ పాటియాలా కోర్టు పోలీసులను ఆదేశించింది. వెంటనే అర్నాబ్ గోస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలని కోర్టు స్పష్టం చేసింది.

ఇక ఇటీవలే కేరళ హైకోర్టు కూడా తన పరువుకు నష్టం చేశాడని శశిథరూర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మరో కేసులో అర్నాబ్ పై క్రిమినల్ పరువునష్టం దావా వేసింది. ఇలా ప్రఖ్యాత జర్నలిస్ట్ అర్నాబ్ పై శశిథరూర్ న్యాయపరంగా పోరాడుతున్నారు.