పెళ్ళైన తొలినాళ్లకేనా 'ఆ ముచ్చట'.. ఆ తర్వాత ఇంకేం లేదా..

Tue Aug 04 2020 16:40:46 GMT+0530 (IST)

A TV Channel Doing Reality Show for Couples

నూతన దంపతులకు పెళ్ళైన తొలి రోజులే వేరు. తమకు తామే లోకమనే తన్మయత్వంలో అల్లుకు పోతుంటారు. ఒకరిపై ఒకరు అంతులేని ప్రేమ ఆప్యాయత చూపుతుంటారు.చుట్టూ ఎంత మంది ఉన్నా తమ దారి తమదే అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. కాస్త సమయం దొరికితే చాలు పడక గదిలో ఏకాంతంగా గడపడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ రోజులు జీవితంలో మరపురానివి. అయితే రాను రాను ఈ పరిస్థితుల్లో మార్పు మొదలవుతుంది. భర్త తన విధుల్లో మునిగి పోవడం భార్య ఇంటి బాధ్యతలు తీసుకోవడం ద్వారా తమ మధ్య కొంత ఎడబాటు ఏర్పరచుకుంటారు. ఇక పిల్లలు పుట్టాక సరే సరి. వాళ్ల బాగోగులు చూసుకోవడం బాధ్యతలు నిరవర్తించడంతోనే సమయమంతా సరిపోతుంది. ఇక క్రమేణా పడక గదికి టాటా చెప్పడం మొదలు పెడతారు. ఏదో నామిక వాస్తిగా ఆ పనేదో ముగిస్తుంటారు. భార్య భర్తలకు తమకు ఒకరిపై మరొకరికి ఎంత ప్రేమ ఉందో చూపుకోవడానికి 'కలయిక' సమయానికి మించినది లేదు. ఇక దానినే నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టగానే ఒకరిపై మరొకరు ' నాపై ప్రేమ తగ్గిపోయింది. మునుపటిలా లేరంటూ ' పోట్లాటకు దిగుతుంటారు.క్రమేణా అవి ముదిరి ఒకరికొకరు దూరం పెంచుకుని తమ దాంపత్య జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు.అందుకే జీవితంలో ఎన్ని బాధ్య తల్లో చిక్కుపోయినా ఆడ అయినా మగ అయినా తమ భాగస్వామికి తగిన సమయం కేటాయించాలి. అప్పుడే వారి జీవితం సుఖమయం అవుతుంది. ఇలా జీవితాన్ని యాంత్రికంగా నడిపే దంపతుల కోసం చానల్ 4 అనే టీవీ చానల్ 'సెక్స్ టేప్' అనే రియాలిటీ షో నిర్వహిస్తోంది. తమ తొలి నాళ్లకు దూరమైన దంపతులకు మళ్లీ ఆ సాంగత్యపు మాధుర్యాన్ని తెలపడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఇందులో దాంపత్య జీవితంలో దూరంగా పెంచుకున్న వారిని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన జంటలతో కెమెరా ముందు సెక్స్ చేయిస్తారు. కలయికలో మెలకువలను తెలిపి ప్రోత్సహిస్తారు. అది టీవీలో కూడా టెలికాస్ట్ చేస్తారు. ఇప్పుడీ ఈ కార్యక్రమం బాగా ఫేమస్ అయ్యి షోలో పార్టిసిపేట్ చేసేందుకు జంటలు భారీగా ముందుకొస్తున్నాయట. ఈ షో కాన్సెప్ట్ బాగుందని సోషల్ మీడియాలో పలువురు ప్రశంసిస్తున్నారు. ఎడబాటుకు దూరమైన జంటలు మళ్లీ తమ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి చక్కటి వేదిక అని కొనియాడుతున్నారు.

TAGS: Couple