Begin typing your search above and press return to search.

కొవిడ్ పిశాచితో యుద్ధానికి ఏమేం చేయాలో చెప్పిన ప్రముఖ శాస్త్రవేత్త

By:  Tupaki Desk   |   19 Feb 2020 3:30 PM GMT
కొవిడ్ పిశాచితో యుద్ధానికి ఏమేం చేయాలో చెప్పిన ప్రముఖ శాస్త్రవేత్త
X
కొవిడ్ 19 మాట విన్నంతనే ఉలిక్కిపడుతోంది ప్రపంచం. ఇలాంటి సమయంలోనే హైదరాబాద్ మహానగరంలో జరుగుతోంది బయో ఏషియా సదస్సు. దీనికి పెద్ద ఎత్తున శాస్త్రవేత్తలతో పాటు.. వైద్య రంగానికి సంబంధించిన ప్రముఖులు హాజరయ్యారు. కొవిడ్ భయాందోళనల వేళ.. ఏ ఒక్కరిని కదిలించినా.. ఇదే అంశం గురించి మాట్లాడుతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపిక్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ పీటర్ మాట్లాడారు.

పెద్ద వయస్కుల్లో వచ్చే న్యూమోనియా లాంటి జబ్బులకు ఇన్ ఫ్లూయోంజా వ్యాక్సిన్ తో అరికట్టవచ్చన్న ఆయన.. వ్యాక్సిన్ తీసుకున్నంతనే వైరస్ లు దాడి చేసినా అంత ప్రభావాన్ని చూపలేవన్నారు. వాటిని ఎదుర్కోవటానికి శరీర రోగ నిరోధక వ్యవస్థ సన్నద్ధం గా ఉంటుందన్నారు.

కొవిడ్ లాంటి వైరస్ లు వ్యాప్తిస్తే నియంత్రించే యంత్రాంగం.. వ్యవస్థలు అమెరికా.. జపాన్ లో ఉన్నట్లుగా భారత్ లో లేవన్న ఆయన.. వైరల్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొవిడ్ వైరస్ ఆందోళన అంతలా ఉన్న వేళ.. పెద్ద వయస్కులకు ముందుస్తు జాగ్రత్తగా ఇన్ ఫ్లూయోంజా వ్యాక్సిన్లు ఇవ్వటం మంచిదన్నారు.

కొత్త వైరస్ ను కనుగొన్న ప్రతిసారీ రక్త నమూనాల్ని ఫూణెకు పంపటం సరికాదన్న ఆయన.. ప్రతి రాష్ట్రంలోనూ ఒక వైరల్ టెస్టింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తే మంచిది కదా? అని ప్రశ్నించారు. నిజమే.. ఇంత పెద్ద దేశంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇలాంటి టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేయటంఅంత పెద్ద విషయం కాదు కదా? అదే సమయం లో.. మాస్కుల తయారీ మీద కూడా ఫోకస్ చేయాలన్నారు. ఈ పెద్దాయన చెప్పినట్లు గా ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు.