Begin typing your search above and press return to search.

కరోనా వైరస్ : చిన్నారికి 15 రోజులుగా దూరంగా ఉంటున్న తల్లి ... సీఎం హామీ !

By:  Tupaki Desk   |   9 April 2020 5:45 AM GMT
కరోనా వైరస్ : చిన్నారికి 15 రోజులుగా దూరంగా ఉంటున్న తల్లి ... సీఎం హామీ !
X
కరోనా వైరస్ ..ఒకవైపు దేశాన్ని చిన్నాబిన్నం చేస్తుంటే , మరోవైపు వైద్య సిబ్బంది బంధాలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఐసోలేషన్ లో కరోనా తో పోరాడుతున్న వారికీ సేవలు చేస్తూ వైద్య సిబ్బంది ఇంటికి కూడా వెళ్లకుండా రాత్రి , పగలు సేవలు చేస్తున్నారు. దీంతో వారి పిల్లలు తల్లిదండ్రులను బాగా మిస్ అవుతున్నారు. కర్ణాటకలో కూడా ఓ చిన్నారి తన తల్లిని 15 రోజుల నుంచి మిస్ అవుతోంది. గోల గోల చేసి , అమ్మ ని చూడాలంటూ ఎలాగోలా ఆసుపత్రి కి అయితే చేరింది. కానీ , అక్కడ దూరం నుండే అమ్మ తో ఏడుస్తూ మాట్లాడటం చుసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.

అసలు ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. కర్ణాటకలోని బెలగం జిల్లాలో బెలగం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రి ఉంది. ఇక్కడ కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఐసోలేషన్ వార్డు రోగులతో నిండిపోయి ఉంది. ఇక్కడ సునంద కొర్‌ పూర్ అనే నర్సు విధులను నిర్వహిస్తోంది. వైరస్ సోకిన ఐసోలేషన్ వార్డులో డ్యూటీ చేస్తుండటం తో 15 రోజులగా ఇంటికి వెళ్లడంలేదు. జిల్లాలో వైరస్ సోకి ఏడుగురు చనిపోవడంతో.. వైద్య సిబ్బందికి కూడా ఆస్పత్రిలోనే వసతి ఏర్పాటు చేశారు. అయితే సునందకు పెళ్లి అయ్యింది. భర్త, మూడేళ్ల కూతురు ఐశ్వర్య ఉన్నారు. ఆ పాప తల్లి పై బెంగ పెట్టుకుంది.

సునంద ఇంటికి వెళ్లక పోవడంతో ఐశ్వర్య తల్లిని మిస్ అవుతోంది. తల్లిని చూడలేక ఉండలేకపోయింది. అమ్మను చూపించాలని నాన్న శ్రీకాంత్ వద్ద గోల చేయడం ప్రారంభించింది. చిన్నారి గోల భరించలేక ఆ తండ్రి ఎలాగోలా మంగళవారం రోజున ఆస్పత్రి వద్దకు తీసుకొచ్చాడు. అక్కడ ఏదో సర్దిచెప్పి తీసుకువద్దాం అని అనుకున్నాడు. కానీ సమస్య మరింత కఠినంగా మారిపోయింది. ఆ చిన్నారి ఏడుపులతో ఆస్పత్రి దద్దరిల్లిపోయింది. ఐసోలేషన్ వార్డు వద్దకు వెళ్లేందుకు వీలుపడలేదు. చివరికి ఆమె క్యాంటిన్ వద్ద కొచ్చింది. తల్లిని చూసి చిన్నారి దగ్గరికి తీసుకోవాలని కోరింది. కానీ ఐసోలేషన్ వార్డులో ఉన్న ఆ తల్లి మనస్సు దానికి ఒప్పుకోలేదు. అడుగుదూరంలో ఉండి.. చిన్నారితో మాట్లాడింది. దగ్గరికి రావాలని పాప కోరడంతో.. ఏం చేయాలో, ఏం చెప్పాలో తెలియని ఆ తల్లి ఏడుస్తుంటే , అక్కడున్న వారందరు కూడా కంటతడి పెట్టుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనితో ఆ వీడియో వైరల్ అయ్యింది. దీనితో ఆ వీడియో ను చూసిన సీఎం యడియూరప్ప స్పందించారు. సునందను పిలిపించి మాట్లాడటమే కాకుండా ఒక లేఖ కూడా రాశారు. అందులో ఆమె పడ్డ బాధను అర్థం చేసుకున్నానని వివరించారు. కఠిన సమయంలో విధుల పట్ల వైద్య సిబ్బంది చూపుతోన్న అంకితభావానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్లిష్టమైన సమయంలో కూడా సేవలు చేస్తున్న వైద్య సిబ్బందిని ప్రభుత్వం మరవదు అని ,కరోనా వైరస్ ప్రభావం తగ్గాక.. సిబ్బంది సమస్యలపై దృష్టిసారిస్తామని.. తప్పకుండా పరిష్కరిస్తామని భరోసానిచ్చారు.