Begin typing your search above and press return to search.

కేసుల్లో అమెరికా..మరణాల్లో ఇటలీ టాప్‌

By:  Tupaki Desk   |   5 April 2020 12:22 PM GMT
కేసుల్లో అమెరికా..మరణాల్లో ఇటలీ టాప్‌
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ తాండవిస్తోంది. ఆ వైరస్‌ వేగంగా విస్తరిస్తోండడంతో రోజురోజుకు ఆ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా 12 లక్షలు దాటాయి. ఆ వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. అయితే ప్రపంచంలోని 205 దేశాల్లో కరోనా ప్రభావం ఉండగా ముఖ్యంగా 15 దేశాల్లో ఈ వైరస్‌ తీవ్రంగా ఉంది. అయితే కరోనా కేసుల్లో కొన్ని దేశాలు మొదటి స్థానం కోసం పోటీ పడుతున్నాయి. మొదట కరోనా పుట్టిన చైనాలో ఆ వైరస్‌ ప్రభావం తక్కువగా ఉండగా ఇప్పుడు అమెరికా - ఇటలీ మధ్య కరోనా కేసుల్లో మొదటి స్థానం కోసం పోటీ పడుతున్నాయి.

కరోనా వైరస్‌ నాంది పలికిన చైనా ఆ కేసులతో పాటు మృతులు భారీ సంఖ్యలో ఉండడంతో కొన్నాళ్ల పాటు మొదటి స్థానంలో ఉన్నది. అయితే ఆ దేశంలో కరోనాను కట్టడి చేయడంతో ప్రస్తుతం కరోనా కేసులు చాలా తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే చైనా తర్వాత మొదటి స్థానం కోసం ఇటలీ భర్తీ చేసింది. ఆ దేశంలో ముందస్తు చర్యలు చేపట్టకపోవడం.. కరోనాను అంచనా వేయకపోవడం.. సరైన చర్యలు తీసుకోకపోవడంతో అనూహ్యంగా కరోనా కేసులు పెరిగాయి. కేసులు ఎంత పెరిగాయో అంతే స్థాయిలో మృతుల సంఖ్య పెరిగింది. దీంతో ఆ దేశం తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నది. ఇప్పుడు ఆ దేశ కన్నా అమెరికా ముందు ఉంది. కరోనా కేసులు రోజుకు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన మృత్యువాత పడుతున్నారు. దీంతో ఇప్పుడు కరోనా కేసుల నమోదులో అగ్రరాజ్యం అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం అమెరికా మొదటి స్థానంలో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన ఒక్క రోజులోనే 5,500 మంది మృతిచెందారని లెక్కలు చెబుతున్నాయి. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు కరోనా బారినపడి 64,716 మంది మృతిచెందారు. ఈ క్రమంలో ప్రపంచంలో మొత్తం కేసుల సంఖ్య 12 లక్షలు దాటగా.. వాటిలో మొత్తం 2.46లక్షల మంది కోలుకున్నారు. ఈ నేపథ్యంలో టాప్‌ లో ఉన్న దేశాలు ఇవే..

దేశం కరోనా కేసులు మృతులు
అమెరికా 3,11,637 8,454
స్పెయిన్‌ 1,30,759 12,418
ఇటలీ 1,24,632 15,362
జర్మనీ 96,108 1,446
ఫ్రాన్స్‌ 89,953 7,560
చైనా 86,199 3,329
ఇరాన్‌ 58,226 3,603
యూకే 41,903 4,313
టర్కీ 23,934 501
స్విట్జర్లాండ్‌ 21,100 666

ఈ విధంగా టాప్‌ పదిలో ఉన్న దేశాలు ఇవే. కొన్ని దేశాలు కేసుల సంఖ్యలో ప్రథమ - ద్వితీయ - తృతీయ స్థానాల్లో ఉండగా.. మరికొన్ని దేశాల్లో మరణాల్లో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే భారతదేశం మాత్రం 25 నుంచి 30 మధ్య ఉంది. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ విధించడంతో భారతదేశంలో కరోనాకు కట్టడి పడింది. అయితే మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లిన వారి వల్ల ఈ కరోనా తీవ్రమైంది. లేకుంటే ఎప్పుడో భారత్‌ కరోనాను జయించి ఉండేది.