Begin typing your search above and press return to search.

రికార్డ్ సృష్టించిన కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ .. ఏంటంటే ?

By:  Tupaki Desk   |   19 Jun 2021 7:31 AM GMT
రికార్డ్ సృష్టించిన కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ .. ఏంటంటే ?
X
కరోనా వైరస్ మహమ్మారి దేశంలోని అన్ని రాష్ట్రాలని అల్లకల్లోలం చేసింది. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ విజృంభణ భయంకరంగా ఉన్నది. కరోనా మహమ్మారి జోరుకి దేశం మొత్తం వణికిపోయింది. ప్రపంచంలోనే ఒక్కరోజులో ఏ దేశంలో కూడా నమోదు కానీ కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు , అలాగే కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. రోజుకి నాలుగు లక్షలకి పైగా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే , ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ తగ్గుతూ వస్తుంది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండొచ్చన్న నిపుణుల సూచనలతో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తోంది.

దేశంలో అవసరం అయిన చోట కరోనా వ్యాక్సిన్ల కొరత లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 27 కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశంలో శుక్రవారం నాటికి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ 154వ రోజుకు చేరింది. శుక్రవారం రాత్రి 7 గంటల వరకు దేశంలో మొత్తం 27,20,72,645 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మూడో విడుత టీకా డ్రైవ్‌లో భాగంగా 18-44 ఏళ్ల సమూహానికి 19,43,765 మందికి మొదటి డోసు ఇచ్చినట్లు వెల్లడించింది. మరో 77,989 మందికి రెండో డోసు టీకా అందజేసినట్లు పేర్కొంది. మూడో దశ డ్రైవ్‌ ప్రారంభించిన నాటి నుంచి మొత్తం 5,15,68,603 డోసుల వ్యాక్సిన్లను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. శుక్రవారం ఒకే రోజు 29,84,172 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇందులో 26,24,028 మంది లబ్ధిదారులకు మొదటి డోసు ఇచ్చారు. మరో 3,60,144 మంది లబ్ధిదారులకు రెండో డోసు అందజేసినట్లు కేంద్రం తెలిపింది.

ఇకపోతే , గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,753 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,98,23,546కి చేరింది. ఇందులో 7.6 లక్షలు యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం కొత్తగా 88,997 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 2.86 కోట్లకు చేరింది. అటు నిన్న 1,647 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,85,137కి చేరుకుంది.