దేశంలో పలు నదులు సరస్సుల్లో కరోనా ... కీలక అధ్యయనాల్లో వెల్లడి !

Sat Jun 19 2021 05:00:01 GMT+0530 (IST)

Corona in many rivers and lakes in the country

మనదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మొదటి వేవ్ తో పోల్చితే సెకండ్ వేవ్ దేశాన్ని మరింతగా కుదిపేసింది. అయితే ఈ మధ్యనే కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ కొంచెం అదుపులోకి వస్తుంది. అలాగే దేశంలో కరోనా మహమ్మారిని అరికట్టడానికి వ్యాక్సిన్ ను చాలా వేగంగా ఇస్తున్నారు. దీనితో దేశంలో కరోనా మహమ్మారి జోరు తగ్గుతూ వస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో అంశం అందరిని ఆందోళనకి గురిచేస్తుంది. అదేమిటి అంటే దేశంలో పలు సరస్సులు నదుల్లో కరోనా ఆనవాళ్లపై పలు అధ్యయన సంస్థలు జరిపిన పరిశోధనల్లో కరోనా వైరస్ ఉన్నట్లుగా గుర్తించారు.తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ కు లైఫ్ లైన్ గా పిలువడుతున్న సబర్మతి నదిలో కరోనా వైరస్ ను సైంటిస్టులు కనుగొన్నారు. నది నుంచి సేకరించిన శాంపిల్స్ లో కరోనా వైరస్ ఉన్నట్లుగా గుర్తించారు. సబర్మతి నదితో పాటు అహ్మదాబాద్ కంకరియా చందోలా సరస్సు సహా ఇతర నీటి వనరుల నుండి తీసిన నమూనాల్లోనూ కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. ఇక అస్సాంలోని గౌహతి ప్రాంతంలోని నదులలో కూడా పరిశోధకలు పరిశోధనలు జరుపగా ఇక్కడా అదే పరిస్థితి ఎదురైంది. భారు నది నుంచి సేకరించిన నమూనాలను పరిశీక్షించగా అందులో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఐఐటీ గాంధీ నగర్ సహా దేశంలోని ఎనిమిది సంస్థలు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. వీటిలో న్యూఢిల్లీలోని జేఎన్‌యూ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ విద్యార్థులు పాల్గొన్నారు. గత సంవత్సరం మురుగునీటి నుండి నమూనాలను తీసుకొని పరీక్షలు జరుపగా.. కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సహజ నీటిలోనూ కరోనా ఉండే అవకాశం ఉందా అని ఆలోచనల నేపథ్యంలో అధ్యయనాలు ప్రారంభించారు. ఆ అధ్యయనాల్లో ముందుగా అనుకున్నట్టే  కరోనా వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయి.