కరోనా సెకండ్ వేవ్ ఎంత భయంకరంగా ఉంటుందంటే .... బ్రిటన్ ఓ ఉదాహరణ!

Fri Oct 30 2020 16:30:11 GMT+0530 (IST)

Corona Second Wave is so terrible .... Britain is an example!

గత ఏడాది చైనా లో వుహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ .. ఏడాది గడుస్తున్నా కూడా ఇంకా కంట్రోల్ అవ్వలేదు. చైనా నుండి ఒక్కొక్క దేశానికి విస్తరించిన ఈ మహమ్మారి ప్రపంచం మొత్తం వ్యాపించింది. ముఖ్యంగా అమెరికా కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకి గతంలో ఎన్నడూ లేని విధంగా గజగజవణికిపోయింది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు అమెరికాలోనే నమోదు అయ్యాయి. ప్రస్తుతం అమెరికాలో 90 లక్షల కి పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత మనదేశంలోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 80 లక్షలకి పైగా కేసులు నమోదు అయ్యాయి.అయితే ఈ ఏడాది మార్చి చివర్లో ప్రపంచం మొత్తం కరోనా భయంకరంగా విస్తరించడంతో ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో కొన్ని దేశాల్లో కరోనా కంట్రోల్ అయినట్టు అనిపించింది. దానితో లాక్ డౌన్ నుండి కొన్ని సడలింపులు ఇచ్చారు. ఆ కారణం చూపి ప్రజలందరూ మళ్లీ రోడ్లపై కి భారీగా వచ్చేశారు. దీనితో తాజాగా పలు దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల జోరు మళ్లీ పెరిగిపోతుంది. కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. సెకండ్ వేవ్ లో మొదటి వేవ్ కంటే భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. గతంలో వేలల్లో నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు లక్షలు దాటిపోతుంది. ఇంపీరియల్ కాలేజీ లండన్ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం అక్టోబరు 16-25 మధ్యన దేశ వ్యాప్తంగా 85 వేల మందిలో నమూనాలు సేకరించారు. ప్రతి పదివేల మందిలో 128 మందికి కరోనా  ఉన్నట్లుగా తేలింది. అక్టోబరు మొదటివారంలో ఈ సంఖ్య కేవలం 60 మాత్రమే కావటం గమనార్హం.

మొదటి సారి కరోనా వ్యాధి వ్యాపించిన సమయంలో కంటే సెకండ్ వేవ్ లోనే మరణాల సంఖ్య భారీగా నమోదు అవుతుంది. అమెరికా బ్రిటన్ లలో ఇప్పటికే సెకండ్ వేవ్  ప్రారంభం అయింది. చలి కాలం కావడంతో మహమ్మారి తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా కేసులు భారీగా పెరిగి పోతుండటంతో ఫ్రాన్స్ లో మళ్లీ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ అక్టోబరు 30 నుంచి డిసెంబరు 1 వరకు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా  45 మిలియన్ల మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అందులో 30.3 మిలియన్ల మంది కరోనా మహమ్మారితో పోరాడి విజయం సాధించారు. ఇక 1.18 మిలియన్ల మంది కరోనా కాటుకి బలైపోయారు.