కాంగ్రెస్ పార్టీ వాళ్లు చేతులు కలిపారు గోతులు తీసుకోరా

Tue Oct 08 2019 14:48:01 GMT+0530 (IST)

Congress men shake hands, don't take pots

హుజూర్ నగర్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీలోని నేతలంతా చేతులు కలిపారట. పార్టీకి చావో రేవోలాంటిది ఈ బై పోల్. ఈ ఉప ఎన్నికలో గనుక కాంగ్రెస్ ఓడితే ఇక కేసీఆర్ కు తిరుగుండదు. ఇప్పటీకే సీఎల్పీ ని విలీనం చేసుకున్న కేసీఆర్ తీరును జనాలు కూడ మెచ్చుకున్నట్టుగా అవుతుంది. హుజూర్ నగర్లో కాంగ్రెస్ ఓడితే టీఆర్ఎస్ కు మరిన్ని ఏనుగుల బలం వస్తుంది.మరి ఈ భయంతోనో  ఏమో కానీ.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు చేతులు కలుపుతున్నారట. హుజూర్ నగర్లో గెలుపు కోసం శ్రమిస్తారట.  హుజూర్ నగర్ ప్రచార పర్వంలోకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డిలు కూడా దిగబోతున్నారట. వీరిద్దేరికీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో గల విబేధాల గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు.

ఉత్తమ్ తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చాలా యేళ్ల నుంచినే పడటం లేదు. అలాగే పీసీసీ అధ్యక్ష పదవిని కూడా ఆయన ఆశిస్తూ ఉన్నారు. ఇలాంటి నేఫథ్యంలో కూడా ఉత్తమ్ భార్య పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారం సాగిస్తారట.

ఇక హుజూర్ నగర్లో తను చెప్పిన అభ్యర్థే పార్టీ తరఫున పోటీ చేయాలని రేవంత్ రెడ్డి ఒక దశలో వాదించారు. అయితే ఆయన చెప్పిన అభ్యర్థికి టికెట్ దక్కలేదు. అయినా ఇప్పుడు ఉత్తమ్ భార్య పద్మావతి రెడ్డి తరఫున ప్రచారానికి రెడీ అవుతున్నారట రేవంత్ రెడ్డి. ఆమెను గెలిపించడాన్ని ఆయన కూడా బాధ్యతగా తీసుకుంటారట. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వాళ్లు పైకి అయితే బాగానే చేతులు  కలుపుతున్నట్టుగా కనిపిస్తున్నారు. లోలోన గోతులు తీసుకోనట్టేనా? అనేది మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే!