Begin typing your search above and press return to search.

మజ్లిస్ కు కాంగ్రెస్ ఆఫర్.. అన్ని సీట్లు ఇస్తుందట?

By:  Tupaki Desk   |   7 Feb 2023 8:14 PM GMT
మజ్లిస్ కు కాంగ్రెస్ ఆఫర్.. అన్ని సీట్లు ఇస్తుందట?
X
కేటీఆర్ తో పంచాయితీ పెట్టుకున్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఆ మరుసటి రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరపడంతో ఈ పొత్తు పొడుస్తుందా? అన్న చర్చ మొదలైంది. కేటీఆర్ వర్సెస్ అక్బరుద్దీన్ వాగ్వాదం ముదిరిపాకాన పడింది. 7 సీట్లు గెలిచిన మీరా మాకు చెప్పేదని కేటీఆర్ ఎద్దేవా చేయడం.. వచ్చేసారి 50 చోట్ల పోటీచేసి మిమ్మల్ని ఓడిస్తామని అక్బరుద్దీన్ సవాల్ చేయడం జరిగిపోయింది.

ఇన్నాళ్లు పాలు నీళ్లలా కలిసిపోయిన బీఆర్ఎస్ ఎంఐఎంల మధ్య సాన్నిహిత్యాన్ని కేటీఆర్, అక్బరుద్దీన్ ఇద్దరూ చెడగొట్టారు. అక్బరుద్దీన్ అలా అన్నాడో లేదో వెంటనే కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డిలు అసెంబ్లీలో అక్బరుద్దీన్ తో చర్చలు జరిపారు. అలా జరిపినట్టు మీడియాకు లీక్ చేశారు. తామే మళ్లీ మీడియా ముందుకు వచ్చి ఉత్తినే అంటూ కవర్ చేశారు. దీంతో బీఆర్ఎస్ కు ఓరకంగా భయంపుట్టించారు.

మజ్లిస్ పార్టీకి తెలంగాణలో అపారంగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు ఉంది. గత సారి కేసీఆర్, అసద్ అవగాహనతో 7 సీట్లలోనే ఎంఐఎంను పోటీకి పరిమితం చేసి అన్ని నియోజకవర్గాల్లో ముస్లిం ఓటు బ్యాంకును బీఆర్ఎస్ కు మళ్లించారు. దీంతో పాతబస్తీలోనే పోటీచేసిన మజ్లిస్ 7 సీట్లు గెలిచింది. అలా కేసీఆర్, అసద్ లు పరస్పరం సహకరించుకొని ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు సహా ఎంఐఎం దేశవ్యాప్త విస్తరణకు ఒకరికొకరు తోడుగా నిలిచారు.

అయితే బీఆర్ఎస్ తో తాజాగా ఎంఐఎం ఫైట్ నేపథ్యంలో కాంగ్రెస్ రంగంలోకి దిగింది. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎంఐఎంతో కాంగ్రెస్ పొత్తు ఉంది. అదే ఇప్పుడు బయటకు తీస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ను విభేదిస్తున్న అక్బరుద్దీన్ ను కాంగ్రెస్ దువ్వడం ప్రారంభించింది. మజ్లిస్ ముందుకు వస్తే నేరుగా పొత్తు కాకపోయినా.. రాజకీయ సహకారం తీసుకోవాలని.. కనీసం 15 సీట్లు అయినా ఇవ్వాలని కాంగ్రెస్ రెడీ అవుతోందట.. మరి ఈ పొత్తు పొడుస్తుందా? బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ తో మజ్లిస్ కలుస్తుందా? అన్నది వేచిచూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.