Begin typing your search above and press return to search.
మోడీ 9 ఏళ్ల పాలనపై చీల్చి చెండాడిన మహిళా కాంగ్రెస్ నేత
By: Tupaki Desk | 11 Jun 2023 3:26 PM ISTప్రధానమంత్రిగా తొమ్మిదేళ్ల నుంచి దేశాన్ని పాలిస్తున్న మోడీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మహిళా కాంగ్రెస్ నేత ఒకరు. తాజాగా తొమ్మిదేళ్ల పాలన విజయాన్ని మోడీ సర్కారు గొప్పగా ప్రచారం చేసుకుంటున్న వేళ.. అందుకు భిన్నంగా ఆమె నోటి నుంచి వస్తున్న అంశాలు కొత్త చర్చకు తెర తీస్తున్నాయి. తొమ్మిదేళ్ల మోడీ ప్రభుత్వంతో దేశ అప్పు మూడు రెట్లు పెరిగిపోయిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ వెల్లడించారు.
మోడీ హయాంలో దేశ అప్పు ఏకంగా రూ.155 లక్షల కోట్లకు చేరుకున్న షాకింగ్ నిజాన్ని తెలిపారు. దేశ ప్రస్తుత ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇదంతా మోడీ పాలనా తీరుతోనే ఇదంతా జరిగిందని ఆమె ఆరోపిస్తున్నారు. మన్మోహన్ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న వేళ యూపీఏ ప్రభుత్వ స్థానే.. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఇప్పటివరకు లెక్కిస్తే.. దేశ అప్పు అదనంగా రూ.100లక్షల కోట్లకు పెరిగినట్లు చెప్పారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న వేళలో.. ఇతర పార్టీలకు చెందిన ప్రభుత్వాలపై ఆయన ఘాటైన విమర్శలు చేసే వారని.. అసమర్థులు.. అవినీతిపరులు.. సత్తా లేనోళ్లు లాంటి మాటలు అనే వారని.. నిజానికి ఈ గుణాలన్నీ మోడీ సర్కారుకే ఉంటాయన్నారు. దేశాన్ని ఆర్థికంగా దెబ్బ తీసి.. నిరుద్యోగాన్ని బాగా పెంచేశారని.. ధరలు కూడా భారీగా పెరిగినట్లు మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థను సరిదిద్దటం అంటే.. టెలీ ప్రాంప్టర్ సాయంతో సుదీర్ఘ ప్రసంగాలు చేయటం కాదన్న ఆమె.. 'నేషనల్ మీడియాలో హెడ్ లైన్ లో దర్శనమిచ్చేలా చేయటం.. వాట్సాప్ సందేశాలుఫార్వర్డ్ చేయటం లాంటివి చేయటం కాదు. మోడీ సర్కారు తీరుతో దేశంలో ఆదాయ అంతరాలు భారీగా పెరిగిపోయాయి. జనాభాలో కేవలం 10 శాతం ఉన్న సంపన్నుల వద్దే 80 వాతం సంపద ఉంది. జీఎస్టీ వసూళ్లలో వీరి వాటా మూడు శాతమే' అంటూ ఘాటు విమర్శలు చేశారు.
మోడీకి ముందు 67 ఏళ్ల పాటు పద్నాలుగు మంది ప్రధానులు మొత్తంగా రూ.55 లక్షల కోట్లు అప్పు తీసుకుంటే.. ఒక్క మోడీ తన తొమ్మిదేళ్ల హయాంలో రూ.100 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని అప్పుల రూపంలో తీసుకొచ్చారన్నారు. ఈ మాటలో నిజం ఎంతన్న విషయాన్ని ప్రభుత్వం చెప్పటంతో పాటు.. ఇంత భారీ అప్పును తీసుకొచ్చి దేని కోసం ఖర్చు చేశారు? అన్న విషయాన్ని వెల్లడించాల్సిన అవసరం ఉంది.