Begin typing your search above and press return to search.

డీఎంకేకు షాకిచ్చిన కాంగ్రెస్.. కమల్ కు ఆహ్వానం

By:  Tupaki Desk   |   20 Oct 2020 11:30 AM GMT
డీఎంకేకు షాకిచ్చిన కాంగ్రెస్.. కమల్ కు ఆహ్వానం
X
తమిళనాట రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆపాత మిత్రుల మధ్య కలహాలు బయటపడుతున్నాయి. అనాది నుంచి తమిళనాట డీఎంకేకు మద్దతుగా కాంగ్రెస్ ఉంది. జాతీయ రాజకీయాల్లోనూ డీఎంకే కాంగ్రెస్ కే మద్దతిస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీ హఠాత్తుగా సెక్యులర్ కూటమిలో చేరాలంటూ మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, హీరో కమల్ హాసన్ ను ఆహ్వానించడం తీవ్ర కలకలం సృష్టించింది. డీఎంకేను కమల్ అప్పట్లో విమర్శిస్తూ ఆ పార్టీ అధినేత స్టాలిన్ పై నోరు పారేసుకున్నారు. ఈ క్రమంలోనే కమల్ వస్తే డీఎంకే ఏకంగా కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతుందా? లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తృతీయ కూటమి ఏర్పాటుకు కమల్ హాసన్ ప్రయత్నాలు ప్రారంభించారు. కలిసివచ్చే పార్టీలన్నీ రావాలని పిలుపునిచ్చాడు. అయితే అది సాధ్యం కాకపోతే కమల్ పార్టీ డీఎంకే-కాంగ్రెస్ కూటమిలో చేరాలని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కమల్ హాసన్ ఆది నుంచి బీజేపీని, హిందుత్వను వ్యతిరేకిస్తూ సెక్యూలర్ వాది రాజకీయాలు చేస్తున్నారు.కాంగ్రెస్ ది కూడా సెక్యులరిజం కావడంతో డీఎంకే-కాంగ్రెస్ కూటమిలో కమల్ హాసన్ పార్టీని చేర్చేకోవాలని కాంగ్రెస్ పార్టీ తాజాగా ఆహ్వానించింది.

అయితే తమిళనాట అతిపెద్ద పార్టీ అయిన డీఎంకేతో సంప్రదించకుండా కమల్ ను ఆహ్వానించడంపై ఆ పార్టీ గుర్రుగా ఉంది. డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ వైదొలుగుతుందనే అనుమానాలు కలుగుతున్నాయి.

అయితే కమల్ ను ఆహ్వానించినా కూడా చేర్చుకోవడం బాధ్యత డీఎంకే అధిష్టానానికే ఉందని కాంగ్రెస్ నాయకులు చెప్పుకొచ్చారు. దీంతో డీఎంకే -కాంగ్రెస్ మధ్య కూటమిలో డీఎంకే ఏం నిర్ణయిస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది.