Begin typing your search above and press return to search.

ఎంపీ అర్వింద్ ఫేస్ బుక్ పోస్టు డిలీట్ చేశారెందుకు?

By:  Tupaki Desk   |   23 Jan 2020 6:08 AM GMT
ఎంపీ అర్వింద్ ఫేస్ బుక్ పోస్టు డిలీట్ చేశారెందుకు?
X
రాజకీయ నేతలకు మొండితనం ఆభరణమైందిప్పుడు. ఎంత మొండిగా ఉంటే అంత మొనగాడన్న పేరు ఇప్పుడు సొంతమవుతోంది. మొండితనానికి దూకుడు తోడైతే.. అగ్నికి ఆజ్యం పోసినట్లే. అసలే రాజకీయ నాయకుడై ఉండి.. చేతిలో పవర్ ఉంటే ఆపే తరమా? అందులోనూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ లాంటి ఫైర్ బ్రాండ్ ఏదైనా అంశాన్ని సీరియస్ గా తీసుకుంటే రచ్చ రచ్చే.

నిన్న (బుధవారం) ముగిసిన పుర ఎన్నికల్లో తన సత్తా చాటాలని తపిస్తున్నారు అర్వింద్. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎలా ఉన్నా.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ ఎంపీ పరిధిలో మాత్రం బీజేపీకి తిరిుగులేదన్న విషయాన్ని పుర ఎన్నికల్లో మరోసారి ఫ్రూవ్ చేయాలన్నది ఆయన తపన. ఇందుకు తగ్గట్లే ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అర్వింద్ దూకుడు ప్రచారం పైన గులాబీ బ్యాచ్ గుర్రుగా ఉంది.

పోలింగ్ కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలన్న నిబంధనను కూడా అర్వింద్ పట్టించుకోలేదంటూ కేసు కూడా నమోదైంది. దీనిపై ఆయన వాదన మరోలా ఉంది. అయితే.. తమకు అందిన ఫిర్యాదు మేరకు.. రూల్స్ ను బ్రేక్ చేసిన ఆరోపణ మీద ఆయనపై చర్యలు షురూ చేశారు. ఇది కాస్తా అక్కడి వాతావరణాన్ని వేడెక్కించింది.

ఇలాంటివేళలోనే.. నిజామాబాద్ నగరంలోని ఒక ప్రార్థనా స్థలం వద్ద ఉన్న ఆక్రమణలపైన ఎంపీ తన ఫేస్ బుక్ ఖాతాలో వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన ఒక పోస్టు చేశారు. దీనిపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయటంతో ఆ పోస్టును తొలగించినట్లుగా ఆర్వింద్ తాజాగా చెప్పారు. అధికారులు చెప్పినట్లే తాను ఫేస్ బుక్ లో పోస్టుల్ని డిలీట్ చేశానని.. అయినప్పటికీ అధికారులు తమపై కేసులు పెడతామని చెబుతున్నారన్నారు.

ఎంతకూ వినని ఆర్వింద్ ను దారికి తెచ్చుకునేందుకు కొత్త పద్దతిని గులాబీ దళం షురూ చేసిందన్న వాదన వినిపిస్తోంది. ప్రతి చిన్న తప్పును భూతద్దంలో చూపించేలా ఫిర్యాదు చేయటం.. దానికి తగ్గ ఆధారాల్ని చూపించటం ద్వారా ఆయనపై కేసుల మీద కేసులు పెట్టించి.. ఉక్కిరిబిక్కిరి చేయాలన్న దుర్మార్గపు ఎత్తుగడను అమలు చేస్తున్నారని అర్వింద్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. పోలింగ్ సందర్భంగా బీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జికి దిగారని పోలీసులతో వాగ్వాదానికి ఆర్వింద్ పై మరో కేసు బుక్ చేయాలన్న ఆలోచనలో పోలీసులు ఉన్నారు. మొత్తంగా చూస్తే.. ఆర్వింద్ కు రానున్న రోజుల్లో కేసులు కొత్త తిప్పలు తెచ్చి పెట్టే వీలుందన్న వాదన వినిపిస్తోంది.