Begin typing your search above and press return to search.

దమ్మాలపాటి పై ఫిర్యాదు.. కేసు నమోదు

By:  Tupaki Desk   |   27 Sep 2020 7:32 AM GMT
దమ్మాలపాటి పై ఫిర్యాదు.. కేసు నమోదు
X
ఇప్పటికే అమరావతి భూకుంభకోణంలో ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.. అది మరిచిపోకముందే దమ్మాలపాటి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది.

దమ్మాలపాటి కుటుంబం తనను మోసం చేసిందని.. రిటైర్డ్ లెక్చరర్ కోడె రాజా రామ్మోహన్ ఫిర్యాదు చేశారు. మొత్తం నలుగురిపై 420,406,506,120బి రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

దమ్మాలపాటి కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో రిటైర్డ్ లెక్చరర్ రామ్మోహన్ కృష్ణాయపాలెం లేక్ వ్యూ అపార్ట్ మెంట్లు నిర్మించాడు. ఫ్లాట్ విషయంలో తనను మోసం చేశారని రామ్మోహన్ ఫిర్యాదు చేశారు. తాను ఒక రిటైర్డ్ లెక్చరర్ అని.. విజయవాడలోని ఉన్న ఇంటిని అమ్ముకున్నట్లు చెప్పాడు.

ఆ తర్వాత ఫ్లాట్ కొందామని చూస్తుంటే ‘క్యాపిటల్ హౌసింగ్ ప్రాజెక్ట్ లిమిటెడ్’ ఎండీ నన్నపనేని సీతరామరాజు తనకు లేక్ వ్యూ లో త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్లు కొనాలని చెప్పాడని.. ఇందులో దమ్మాలపాటి శ్రీనివాస్ కుటుంబానికి భాగం ఉందని నమ్మించాడని తెలిపారు.

దీంతో రూ.50లక్షలు చెల్లించి రెండు ప్లాట్లు బుక్ చేసుకొని అడ్వాన్స్ ఇచ్చానని.. ఇప్పటిదాకా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడని రామ్మోహన్ ఆరోపిస్తున్నాడు. మరో స్తలాన్ని చూపించారని.. దానికి రూ.73 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశామని.. ఒక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేశారని.. మిగిలిన రెండు ఆస్తుల రిజిస్ట్రేషన్ పై ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని రామ్మోహన్ ఆరోపించారు.

డబ్బులు తిరిగి ఇవ్వమంటే బెదిరిస్తున్నారని.. లాక్ డౌన్ వల్ల హైదరాబాద్లో ఉన్నానని.. అందుకే ఇంత ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశానని రామ్మోహన్ తెలిపాడు.