శ్రీలంక కెప్టెన్ తో కోచ్ ఆర్థర్ గొడవ..ఇక కెరీర్ ముగినట్టేనా ?

Wed Jul 21 2021 14:19:21 GMT+0530 (IST)

Coach Arthur clashes with Sri Lanka captain

శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రధాన కోచ్ మికీ ఆర్థర్ కు ఆ జట్టు కెప్టెన్ దాసున్ షనకల మధ్య వాగ్వివాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. శ్రీలంక ఆటగాళ్లు మ్యాచుపై పట్టు కోల్పోతోన్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లో కోపంతో ఊగిపోయిన ఆర్థర్ ఆటగాళ్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మ్యాచ్ చివరి ఓవర్ల సమయంలో ఆర్థర్  మైదానంలోకి వచ్చి కెప్టెన్ షనకతో మాట్లాడారు. అదే సమయంలో షనక కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య  వాగ్వివాదం చోటు చేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళ్తే ..  కొలంబో వేదికగా మంగళవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో శ్రీలంక జట్టుని శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని యువ భారత్ 3 వికెట్ల తేడాతో ఓడించింది. గెలుపు ఖాయం అనుకుని సంతోషంలో ఉన్న లంక ఆశలపై దీపక్ చహర్ నీళ్లుచల్లాడు. ఓడిపోతున్నామన్న దశలో భువనేశ్వర్ కుమార్ తో కలిసి 8వ వికెట్‌కు 84 పరుగులు జోడించిన చహర్ భారత్ కి ఒంటి చేత్తో విజయం అందించాడు. అయితే  మొదట టీమిండియా ఓటమి దిశగా సాగుతున్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లో సంతోషంగా కనిపించిన శ్రీలంక టీం కోచ్ ఆర్థర్.. దీపక్ చహర్ భువనేశ్వర్ కుమార్ ల ఇన్నింగ్స్ అతడిని సహనం కోల్పోయేలా చేశాయి. ఈ సందర్భంగా అతను డ్రెస్సింగ్ రూమ్ లో కోపంతో విచిత్రమైన హావభావాలు ఇచ్చాడు. పదేపదే డగౌట్ లోకి వచ్చి అసహనం వ్యక్తం చేశాడు.

ఇక మ్యాచ్ చివర్లో లంక ఓటమి దాదాపు ఖామమైంది. ఈ నేపథ్యలోనే ఆర్థర్ మ్యాచ్ మధ్యలో మైదానంలోకి వచ్చి కెప్టెన్ షనకతో ఏదో చర్చించాడు. ఆర్థర్ ఏవో సైగలు చేస్తేంటే షనక కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. ఇరువరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. శ్రీలంక జట్టు ప్రధాన కోచ్ మికీ ఆర్థర్‌కు సంబందించిన ఫొటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు మీమ్స్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఇదే దురుసు ప్రవర్తనతో పాక్ జట్టులో పదవి పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ మికీకి బుద్ది రాలేదు' అని ఒకరు కామెంట్ చేయగా.. మికీ ఆర్థర్ కెరీర్ ముగినట్టే ఇగ అని ఇంకొకరు కామెంట్ చేశారు. టీమిండియా ఆటతీరును డిస్టర్బ్ చేయాలనే ఇలా ప్లాన్ తోనే షనకతో గొడవపడ్డాడు  అంటూ కెమెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (50) చరిత్ అసలంక (65) అర్ధ సెంచరీలతో రాణించారు. భానుక 36 ధనంజయ డి సిల్వా 32 చివర్లో కరుణ రత్నె 44 పరుగులతో రాణించడంతో శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. భారత బౌలర్లలో చాహల్ భువనేశ్వర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా దీపక్ చాహర్ 2 వికెట్లు తీసుకున్నాడు.  శ్రీలంక నిర్దేశించిన 276 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 116 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి వన్డే హీరోలు పృథ్వీషా (13) ఇషాన్ కిషన్ (1) ఈసారి విఫలమయ్యారు. కెప్టెన్ శిఖర్ ధవన్ 29 పరుగులు చేసి అవుటయ్యాడు. మనీష్ పాండే (37) సూర్యకుమార్ యాదవ్ (53) కృనాల్ పాండ్యా (35) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే వీరు అవుటయ్యాక భారత ఓటమి ఖాయమనుకున్న వేళ క్రీజులో పాతుకుపోయిన చాహర్ భువనేశ్వర్ (19 నాటౌట్)తో కలిసి  జట్టును విజయపథాన నడిపించాడు. శ్రీలంక నిర్దేశించిన 276 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 49.1 ఓవర్లలో చేరుకొని విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. శ్రీలంక బౌలర్లలో హసరంగా మూడు వికెట్లు తీసుకోగా రజిత లక్షణ్ శందాకన్ దాసున్ శనక చెరో వికెట్ తీసుకున్నారు.