యుగాంతం.. మళ్లీ రాబోతోందా.?

Thu Aug 22 2019 13:37:15 GMT+0530 (IST)

Climate change is causing Himalayan glaciers to melt twice as fast, research shows

భూమికి ఉత్తరాన.. అట్లాంటిక్ సముద్రంలో ఉంటుంది ‘ఐస్ ల్యాండ్’ దేశం. దాదాపు మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. జనాభా చాలా తక్కువ. దానిపైనే గ్రీన్ ల్యాండ్ దేశం ఉంటుంది. ఇది మొత్తం మంచు దేశం. 3 కీ.మీల మంచు కప్పబడి ఉంటుంది.కొన్నివేల ఏళ్లుగా ఇక్కడ గడ్డకట్టుకుపోయిన హిమానీనదాలు అలానే కొండల మధ్యన ఉన్నాయి. ఇన్నేళ్లలో జరగని ఉపద్రవం తాజాగా చోటు చేసుకుంది. తాజాగా ఐస్ ల్యాండ్ లోని ‘ఒకుకూల్’ అనే హిమానీనదం అంతరించిపోయింది. ఇది కరిగి సముద్రంలో కలిసిపోయినట్టు శాస్త్రవేత్తలు ఈనెల 18న షాకింగ్ ప్రకటన చేశారు. వాతావరణ మార్పులతో భూమిపై పర్యావరణం దెబ్బతిని ఇలా హిమానీ నదం కరిగిపోయిందని వివరించాడు.

ఐస్ ల్యాండే కాదు.. దానిపైనున్న గ్రీన్ లాండ్ - ఆర్కిటిక్ - అంటార్కిటికాలోని హిమానీ నదాలు కూడా కరిగిపోతుండడం డేంజర్ సిగ్నల్ గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. భారత్ కు ఉత్తరన ఉన్న హిమాలయాల్లోని హిమానీ నదాలు కూడా కరిగిపోతున్నాయని పెను ప్రమాదం వాటిల్లక తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమానీ నదాలు కరగడానికి గ్రీన్ హౌస్ ఉద్గారాలు - కాలుష్యం - కార్పన్ డై అక్సైడ్ కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వాయు కాలుష్యం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి లక్షల ఏళ్ల నాటి హిమానీ నదాలు కరిగిపోతున్నాయని చెబుతున్నారు. ఈ పరిమాణంతో ప్రపంచంలోని దేశాలన్నీ మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుందని.. మరో యుగాంతం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హిమానీనదాలు ఇలానే కరిగితే సముద్రంలోని దేశాలన్నీ మొదట మునిగిపోతాయని.. ఆ తర్వాత భారత్ లాంటి ఉపఖండం తీరప్రాంత ముంబై - చెన్నై - కోల్ కతాలకు కూడా ముప్పేనని చెబుతున్నారు. ఇలానే కరిగితే ప్రపంచమే మునిగి మొత్తం సముద్రమే అవుతుందని హెచ్చరిస్తున్నారు. వాయుకాలుష్యంతో మనమే యుగాంతానికి నాంది పలుకుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.