Begin typing your search above and press return to search.

'క్లాస్ వార్' మాట కు కొత్త పోస్టర్ తో అదిరేలా కౌంటర్?

By:  Tupaki Desk   |   2 Jun 2023 10:00 PM GMT
క్లాస్ వార్ మాట కు కొత్త పోస్టర్ తో అదిరేలా కౌంటర్?
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని ఒక విషయంలో మెచ్చుకోవాలి. తన లోపాల్ని తెలివి గా కవర్ చేసుకునే సత్తా ఆయన సొంతం. తానేమీ అద్భుతమైన వక్త కాదన్న విషయం ఆయనకు తెలుసు. అందుకే ఆయన తన లోపాన్ని ఎదుటివారు గుర్తించి వేలెత్తి చూపించేందుకు అవకాశం ఇవ్వకుండా.. తన మాటల కు భావోద్వేగాల్ని రంగరించేస్తారు.

సంచలనాల కు కేరాఫ్ అడ్రస్ గా మాట్లాడటమేకాదు.. ప్రత్యర్థులు తమ మాట ను.. భాషను వేలెత్తిచూపించే దాని కన్నా.. వారిపై తాను వేసిన బాంబుల్లాంటి మాటలకు సమాధానాలు చెప్పేందుకు సరిపడే సమయం లేని రీతి లో ఫైర్ అవుతారు.

విపక్షాలు తనను టార్గెట్ చేసిన నేపథ్యంలో కొత్త తరహా ప్రచారానికి తెర తీశారు సీఎం జగన్. ఏపీ లో ఇప్పుడు క్లాస్ వార్ జరుగుతుందని.. తాను పేదల పక్షాన ఉంటే.. విపక్షాలు సమాజం లోని ధనిక వర్గాల వెంట ఉండి.. వారి ప్రయోజనాల్ని కాపాడేలా వ్యవహరిస్తుందన్న వాదనను తెర మీద కు తీసుకొచ్చారు. క్లాస్ వార్ అంటూ పదే పదే ప్రస్తావిస్తూ.. తాను బటన్ నొక్కుతూ నిధులను పేదల ఖాతాల కు పంపుతుంటే.. విపక్ష నేతలు కళ్ల వెంట రక్తం కారుతోందన్న మాట ఆయన ప్రసంగాల్లో ఎక్కువ అవుతోంది.

దీంతో.. ఈ క్లాస్ వార్ మాటను ఎదుర్కోవటం ఎలా అన్నది విపక్షాల కు ఇప్పుడో పెద్ద తలనొప్పిగా మారింది. తాము ఎంత చెప్పినా.. క్లాస్ వార్ మాట ఎఫెక్టు పేదల మీద ఎక్కువగా ఉండటంతో విపక్షాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఇప్పటికే క్లాస్ వార్ మీద కౌంటర్లు వేసినా.. అవేమీ జగన్ నోటి నుంచి వచ్చిన మాట కు ధీటు గా నిలిచింది లేదన్నట్లుగా పరిస్థితి ఉంది. దీంతో.. జగన్ మీద డైరెక్టు అటాక్ చేసేందుకు వీలుగా ఒక ఎత్తుగడను తాజాగా వేశారని చెబుతున్నారు.

క్లాస్ వార్ అంటూ పేదల పక్షాన నిలిచినట్లుగా మాటలు చెప్పే జగన్ మాటల్లోనే తప్ప చేతల్లో కాదన్న విషయాన్ని అర్థమయ్యేలా తెలుగుదేశం.. జనసేనలు కొత్త పోస్టర్ కు శ్రీకారం చుట్టారని తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో జగన్ కు ఉన్న ప్యాలెస్ లాంటి ఇళ్ల ఫోటోల ను వేసి.. పేదల కు ఇస్తానన్న సెంటు స్థలం.. జగన్ నివాసం ఉండే భవనాల్ని చూపిస్తూ భారీ ఎత్తున పోస్టర్ల ను తీసుకొస్తారని చెబుతున్నారు.

జగన్ మాటల్లో వినిపించే క్లాస్ వార్.. చేతల్లో ఉండదని.. వందల కోట్ల ఆస్తులు ఉన్న జగన్.. ఏ రోజు తన ఆస్తుల నుంచి పేద వారికి ఇచ్చిందేమీ లేదన్న విషయాన్ని తెలియజేసేలా టీడీపీ.. జనసేనలు ప్రచారానికి ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే నిజమైతే.. ఏపీ లో క్లాస్ వార్ మరింత ముదిరినట్లుగా చెప్పక తప్పదు.